Viral Video : జస్ట్ మిస్.. మరో క్షణం ఆలస్యమైనా..!!

by Javid Pasha |
Viral Video : జస్ట్ మిస్.. మరో క్షణం ఆలస్యమైనా..!!
X

దిశ, ఫీచర్స్: కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని ప్రమాదాలు ముంచుకొస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా విహారయాత్రలకు వెళ్లినప్పుడు, పర్వత ప్రాంతాలకు వెళ్లి ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కొందరికి అక్కడ పులులు, ఎలుగు బంటులు, నక్కలు వంటి అడవి జంతువులు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ వాటి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన వారు చాలా మందే ఉంటారు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది.

వైరల్ సమాచారం ప్రకారం.. సెర్బియాకు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ స్టెఫాన్ జాంకోవిక్ ఓ కొండప్రాంతానికి వెళ్లాడు. ఎందుకో గానీ అక్కడ ఓ పెద్ద మట్టి గుంతలో కూర్చున్నాడు. కానీ అంతలోనే అటు నుంచి ఓ ఎలుగుబంటి వచ్చింది. అతను ఉన్నచోటికి వచ్చేందుకు ప్రయత్నించింది. అంతలో ఏమైందో కానీ.. లోపలికి రాకుండానే వెనుదిరిగింది. అయితే అప్పటి వరకూ భయం భయంగా ప్రాణాలు చేతిలో పట్టుకొని కూర్చున్న జాంకోవిక్ ఊపిరి పీల్చుకున్నాడు. కాసేపు అందులోనే ఉండిపోయిన అతను గోతి నుంచి బయటకు వచ్చి వెళ్లే ప్రయత్నం చేయగా అంతసేపు ఎక్కడ ఉన్నదో కానీ.. ఆ ఎలుగు బంటి తిరిగి మళ్లీ వచ్చింది. కానీ అతనిమీద దాడిచేయలేదు. దగ్గరకు వచ్చి వాసన చూసి వెళ్లి పోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జాంకోవిక్ అదృష్టవంతుడని పలువురు నెట్టిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Read More...

మగ ఈగల వింత ప్రవర్తన.. ఆడ ఈగ అందుకు వద్దంటే.. మనుషుల మాదిరిగానే ఏం చేస్తాయో తెలుసా?



Video Credits to stefan jancovichon Ista Id

Advertisement

Next Story

Most Viewed