Viral Video : ప్రతీ క్షణం. భయం.. భయం.. ఆ వ్యక్తి ఒంటరి ప్రయాణంలో ఉండగా ఏం జరిగిందంటే..

by Javid Pasha |   ( Updated:2024-08-27 06:11:18.0  )
Viral Video : ప్రతీ క్షణం. భయం.. భయం.. ఆ వ్యక్తి ఒంటరి ప్రయాణంలో ఉండగా ఏం జరిగిందంటే..
X

దిశ, ఫీచర్స్: ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో విహరించడం కొందరికి ఆనందాన్ని ఇస్తుండవచ్చు. కానీ ఇది అన్ని సందర్భాలకూ వర్తించదు అంటున్నారు నిపుణులు. నిజానికి మన చుట్టూ నలుగురు ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాం. మనసులోని భావాలను, భిన్నాభిప్రాయాలను పంచుకుంటాం. ఎమోషనల్ సపోర్ట్ కూడా లభిస్తుంది. దీంతో ఆనందంగానూ, ఆరోగ్యంగానూ ఉంటాం. కానీ ఒంటరితనంలో ఇలాంటి అవకాశం మిస్ అవుతాం. పైగా అదొక భయంకరమైన అనుభవంగానూ పలువురు పేర్కొంటారు. సరిగ్గా అలాంటి పరిస్థితిని కళ్లకు కట్టే వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తాను ప్రతీ క్షణం ఎదుర్కొన్న ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్నాడు.

సముద్రం అంటేనే అదో మహా ప్రపంచం.. ఎగసి పడుతున్న రాకాసి అలలు.. హోరున వీచే గాలులు, వాటి శబ్దాలు.. భయంకరమైన సొర చేపలు, ఇతర జీవుల సంచారం అక్కడ సహజంగానే దర్శనమిస్తుంటాయి. పెద్ద పెద్ద బోట్లల్లో ప్రయాణించినా సరే.. సముద్రపు నీటిలో వీటన్నింటి మధ్య నుంచి జర్నీ చేయడం ఆనందంతోపాటు భయాన్ని కూడా కలిగిస్తుంది. కొంతమంది కలిసి సమూహంగా జర్నీ చేస్తున్నప్పుడు ఇబ్బంది అనిపించదు. కానీ కేవలం ఒకే ఒక వ్యక్తి నడి సంద్రంలో, నడిరేయిలో రకరకాల వాతావరణ పరిస్థితుల మధ్య ప్రయాణిస్తే.. ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ.. కానీ ఆ భయాన్ని అనుభవిస్తూ ఎలాగోలా బయట పడ్డాడు ఓ సోలో ట్రావెలర్ టామ్ వాడింగ్టన్.

నిజానికి టామ్ వాడింగ్టన్ (Tom Waddington) ఒక ‘స్కీ కోచ్’. 2020లో అతని ప్రియురాలు హాట్టీ హారిసన్ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ సమయంలో ఓ సంస్థ అతనికి భారీ సహాయం చేసింది. అప్పటి నుంచి అతను కూడా ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. అప్పుడప్పుడూ సముద్ర మార్గంలో వివిధ ప్రాంతాలకు వెళ్లి విరాళాలు సేకరించడం, సహాయం చేయడం చేస్తుంటాడు. ఇందులో భాగంగా కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి ఇంగ్లాండ్‌లోని పెన్ జాన్స్‌ వరకు అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా 3704 కిలోమీటర్లు దూరం సముద్రంలో పడవపై ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. ఈ సోలో జర్నీ పూర్తి చేయడానికి అతనికి 45 రోజుల 5 గంటల 15 నిమిషాలు పట్టిందట.

కాగా సోలో అట్లాంటిక్ మహా సముద్రంలో జర్నీలో ఉన్న టామ్ వాడింగ్టన్‌కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. తాను ప్రయాణిస్తున్నప్పుడు చుట్టు పెద్ద పెద్ద సొరచేపలు, పైలట్ తిమింగలాలు చుట్టు ముట్టాయని అతను పేర్కొన్నాడు. ఆ తర్వాత వందలాదిగా వచ్చాయని, తన పడవను తాకుతూ.. శబ్దాలు చేస్తూ ఉంటే భయం వేసిందని చెప్పిన వాడింగ్టన్ నిజానికి సోలో జర్నీ అంత ఈజీ కాదని, ప్రతీ క్షణం భయపడ్డానని చెప్పుకొచ్చాడు. తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకోవడంతోపాటు తన జర్నీకి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ అతని ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Video Credits To Tomwaddington-skier Insta Id

Advertisement

Next Story

Most Viewed