Viral Video: రెస్టారెంట్లో కూర్చొని ఉన్న యువకుడు.. లేడీ వెయిటర్ రాగానే ఏం చేశాడంటే..

by Javid Pasha |   ( Updated:2024-08-23 13:51:45.0  )
Viral Video: రెస్టారెంట్లో కూర్చొని ఉన్న యువకుడు.. లేడీ వెయిటర్ రాగానే ఏం చేశాడంటే..
X

దిశ, ఫీచర్స్ : అదొక రెస్టారెంట్. అక్కడికి వచ్చిన వారిలో కొందరు తమ తమ ప్లేస్‌లలో కూర్చొని ఉన్నారు. కొందరు తింటున్నారు. ఇంతలోనే ఓ యువకుడు తన ఫ్యామిలీతో కలిసి అక్కడికి వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇది గమనించిన ఓ లేడీ వెయిటర్ ఆ యువకుడి ఫ్యామిలీకి సర్వ్ చేసేందుకు అక్కడికి వెళ్లగా.. సదరు యుకుడు ఒక్కసారిగా టేబుల్‌పై ఉన్న ఖాళీ ప్లేటును తీసి యువతి ముఖంపై కొట్టాడు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే..

వీడియో సమాచారం ప్రకారం.. లండన్‌లోని స్ట్రాట్ ఫోర్డ్ ఏరియాలోని రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి వెళ్లాడు. వారంతా కలిసి అక్కడ టేబుల్ వద్ద కూర్చున్నారు. ఇంతలోనే ఓ లేడీ వెయిటర్ అక్కడికి వచ్చింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఒక్కసారిగా అక్కడ కూర్చున్న యువకుడు ఖాళీ ప్లేట్ తీసుకొని, లేడీ వెయిటర్ ముఖంపై కొట్టాడు. ఆ తర్వాత భార్య, బిడ్డతో కలిసి హడావిడిగా వెళ్లిపోయాడు. లేడీ వెయిటర్ కూడా అలా కొట్టిన వ్యక్తిని ఏమీ అనకుండానే సైలెంట్‌గా వెళ్లిపోయింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అసలేం జరిగిందో తెలియక నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

For video: https://x.com/BLAIMGame/status/1826284943745618370

Advertisement

Next Story