viral: పొరపాటున ఆ పనిచేశారు.. తీరా చెత్త కుప్పలో కనిపించే సరికి!

by Javid Pasha |
viral: పొరపాటున ఆ పనిచేశారు.. తీరా చెత్త కుప్పలో కనిపించే సరికి!
X

దిశ, ఫీచర్స్ : అనుకోకుండా పొరపాట్లు జరగడం సహజమే.. ఆ తర్వాత చాలా మంది అయ్యో.. అలా చేశామా.. అనుకొని సరిదిద్దుకుంటారు. కానీ కొన్నిసార్లు వీటి ప్రభావం మరోలా ఉంటుంది. బాధితులను ఒక్కసారిగా ఆందోళనకో, ఆవేదనకో గురిచేస్తుంది. అటువంటి సంఘటకు సంబంధించిన ఓ న్యూస్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అసలు విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

చెన్నైకి చెందిన దేవరాజ్ అనే వ్యక్తి తన కూతురు వివాహం కోసం రూ. 5 లక్షల విలువైన ఓ డైమండ్ నెక్లెస్‌ను కొనుగోలు చేశాడు. తర్వాత లోపల భద్రపర్చుదామనుకొని ఇంటిలోని ఓ ప్లేస్‌లో పెట్టాడు. ఆ తర్వాత దాని సంగతి మర్చిపోయి తన పనుల్లో నిమగ్నమైపోయాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఇల్లు క్లీన్ చేసే సందర్భంగా పేపర్ల కింద ఉన్న నెక్లెస్‌ను గమనించకుండా దానిని కూడా చెత్త డబ్బాలో వేసి, తర్వాత చెంత కుండీలో పడేశారు.

అయితే తను నెక్లెస్ సరిగ్గా భద్ర పర్చలేదన్న విషయం ఆలస్యంగా గుర్తుకు వచ్చిన దేవరాజ్ అది పెట్టిన ప్లేస్‌కి వెళ్లి చూస్తే కనిపించలేదు. ఫ్యామిలీ మెంబర్స్‌ని ఆరా తీయగా.. అసలు విషయం తెలిసొచ్చింది. చెత్తతోపాటు అది కూడా పడవేసి ఉంటామని గ్రహించిన వారంతా వెంటనే చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లను సంప్రదించి జరిగిన విషయం చెప్పారు. దీంతో సానుకూలంగా స్పందించిన అధికారులు చెత్త నిర్వహణ చూసుకునే అధికారులకు, పారిశుధ్య కార్మికులకు సమాచారం ఇచ్చి రివకరీ కోసం ప్రయత్నించాలని ఆదేశించారు. దీంతో పారిశుధ్య కార్మికులు చెత్త డబ్బాలన్నింటినీ జల్లెడ పట్టగా.. ఓ చెత్త కుప్పలో పూలమాల మధ్య చిక్కుకుపోయిన డైమండ్ నెక్లెస్ బయటపడింది. ఇక అధికారులు దానిని పోగొట్టుకున్న కుటుంబ యజమాని దేవరాజ్‌కి అప్పగించగా.. అతని కుటుంబం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అధికారులు స్పందించిన తీరును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed