Viral: అక్కడ నొప్పిగా ఉందని ఆస్పత్రికొచ్చిన యువతి.. మెడికల్ టెస్టులు చూసిన డాక్టర్లు ఒక్కసారిగా..!

by Javid Pasha |
Viral: అక్కడ నొప్పిగా ఉందని ఆస్పత్రికొచ్చిన యువతి.. మెడికల్ టెస్టులు చూసిన డాక్టర్లు ఒక్కసారిగా..!
X

దిశ, ఫీచర్స్: ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదని ఓ యువతి ఆస్పత్రికి వచ్చింది. తొలనొప్పి వేధిస్తోందని, కళ్లు ఉబ్బడంతోపాటు మండుతున్నాయని, తొడల భాగంలో నొప్పిగా ఉంటోందని డాక్టర్లకు వెల్లడించింది. దీంతోపాటు ఆమెలో ఏవో ప్రమాదకర అనారోగ్య సంకేతాలు గుర్తించిన వైద్యులు ఎంఆర్ఐ, సిటీ‌స్కాన్ సహా పలు మెడికల్ టెస్టుల కోసం రిఫర్ చేశారు. ఇక రిపోర్టులు వచ్చాక పరిశీలించిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్‌‌ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్ సమాచారం ప్రకారం.. చైనాలోని డెకిన్ కౌంటీ యుబెంగ్ అనే గ్రామానికి చెందిన ఓ 23 ఏండ్ల యువతి ఉబ్బిన కళ్లు, రెటీనా నుంచి రక్తస్రావం, తలనొప్పి, తొడభాగాల్లో అసౌకర్యం, ఛాతీలో నొప్పి వంటి సమస్యలతో అక్కడి న్యూరో ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరిశీలించిన వైద్యులు ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఎక్స్‌రే సహా పలు మెడికల్ టెస్టులు చేయించారు. తర్వాత రిపోర్టును పరిశీలించగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఒంటినిండా ఏవో జరాన్న జీవులు పాకుతున్నట్లు అందులో తేలింది. అంతేకాకుండా కళ్లు, మెదడు, ఉదరం, కండరాలు ఇలా పలు శరీర భాగాల్లో టేప్‌వార్మ్ గుడ్లు నిండి ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. ఫైనల్‌గా ఆ యువతి సిస్టిసెర్కోసిస్ (Cysticercosis) అనే వ్యాధి బారిన పడినట్లు తేల్చారు. తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఇక డెకిన్ కౌంటీ యుబెంగ్‌కు చెందిన యువతికి శరీరంలో పరాన్న జీవులు పాకే సిస్టిసెర్కోసిస్ ఎందుకు వచ్చిందోనని డాక్టర్లు ఆరాతీయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సదరు యువతి పదేండ్లుగా పచ్చి ఫోర్క్ మాంసం తింటోందని తెలిసింది. ఇలా పంది మాంసమే కాదు, ఏ జంతువు మాంసాన్ని అయినా సరిగ్గా ఉడకబెట్టకుండా లేదా పచ్చి తినడం చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దానివల్ల పరాన్న జీవులు శరీరంలోకి చేరి రోగాలకు కారణం అవుతాయని, మెదడును, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే సిస్టిసెర్కోసిస్ వ్యాధికి గురై మరణం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే పచ్చి మాంసం, వంట చేసినప్పుడు సరిగ్గా ఉడకని మాంసం అస్సలు తినకూడదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దీనిద్వారా తెలిసొచ్చిందని పలువురు స్పందిస్తున్నారు.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్ సమాచారం ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed