- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral : డెడ్ బాడీలను భద్రపరుస్తున్న కంపెనీ.. ఎందుకు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
దిశ, ఫీచర్స్: గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయినప్పుడో, ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసమో, మెడికల్ స్టూడెంట్ల ప్రయోగాలకోసమో మృతదేహాలను మార్చురీల్లో భద్ర పరుస్తుంటారు. ఇది కామన్. కానీ ఓ కంపెనీ మాత్రం భవిష్యత్తులో వృద్ధాప్యాన్ని జయించడం కోసం, చనిపోయిన వారిని బతికించే ఆలోచనతో శవాలను భద్రపరుస్తోంది. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం మెడికల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే రోజుల్లో క్యాన్సర్, ఎయిడ్స్, వివిధ అంటు వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులను పూర్తిగా నయం చేసేందుకు అవసరమైన మెడిసిన్ అండ్ టెక్నాలజీ కోసం మరిన్ని పరిశోధనలు జరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, భవిష్యత్తులో మనుషుల్ని బతికించే టెక్నాలజీ కూడా వస్తుందని అమెరికాకు చెందిన ‘ఆల్కోర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్’’ పేరుతో ఉన్న ఓ కంపెనీ బలంగా నమ్ముతోంది. ప్రస్తుతం ఇది టాప్ ‘క్రయోనిక్స్’ కంపెనీగా ఉందని నిపుణులు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ కంపెనీ మృతదేహాలపై ప్రయోగాలు చేయడం కోసం, భవిష్యత్తులో మరణం తర్వాత కూడా మనుషులను బతికించే ఉద్దేశంతో డెడ్ బాడీలను ప్రిజర్వ్ చేస్తోంది. ఇప్పటి వరకు 234 శవాలను భద్రపరిచినట్లు పేర్కొన్నది. ప్రజెంట్ ఈ వార్త వైరల్ అవుతుండగా.. చనిపోయిన వారిని బతికించడం సాధ్యం అవుతుందో లేదో కానీ, మీ నమ్మకం, ఆశయం మాత్రం గొప్పగా అనిపిస్తోందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.