- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిమిషంలో 16 విన్యాసాలు చేసి, వరల్డ్ రికార్డ్ సృష్టించిన గినియా పంది! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తరచుగా దాని సోషల్ మీడియా ఖాతాల్లో ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతమైన రికార్డుల గురించి అప్ టూ డేట్ పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే నార్త్ కరోలినాకు చెందిన ఒక గినియా పిగ్ సాధించిన ఓ అద్భుతమైన ప్రపంచ రికార్డును ఈ సంస్థ షేర్ చేసింది. ఇందులో 'ఒక నిమిషంలో గినియా పిగ్ చేసిన అత్యధిక విన్యాసాలు' అంటూ ప్రపంచ రికార్డ్ టైటిల్‌ను సంపాదించడానికి అది ఎలా ట్రిక్స్ నేర్చుకుందో వివరించింది. ఈ వరల్డ్ రికార్డ్ ప్రయత్నానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ అధికారిక ఫేస్బుక్ పేజీలో షేర్ చేసింది. "ఒక నిమిషంలో గినియా పంది ప్రదర్శించిన చాలా ట్రిక్స్ - కోకో, గ్వెన్ ఫోర్డ్-16," అని Facebookలో క్యాప్షన్ రాశారు. కోకో అనే గినియా పంది తన యజమాని గ్వెన్ ఆదేశాలపై ఈ విన్యాసాలు చేస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఇది ఎంత క్యూట్‌గా చేస్తుందో వీడియోలో మీరూ చూడండి.