- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విసినేషన్ వెడ్డింగ్స్.. సంస్కృతి, సౌలభ్యమే ప్రయారిటీ!
దిశ, ఫీచర్స్ : రెండు మూడేళ్ల క్రితం డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పట్ల యువతరంలో ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం చాలామంది విసినేషన్ వెడ్డింగ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగానే స్థానికంగా పెళ్లి చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కొందరు అభిప్రాయ పడుతుంటే.. సౌలభ్యం, ఆర్థిక వనరులపై బాధ్యత, సంప్రదాయాల పట్ల మక్కువ కూడా ఇందుకు కారణమని మరికొందరు నిపుణులు చెప్తున్నారు.
కపుల్స్ తాము వివాహ బంధంతో ఒక్కటవ్వడానికి సుదూర ప్రదేశాలకు వెళ్లకుండా తమకు దగ్గరి ప్రదేశాలలో లేదా ఇండ్ల వద్ద పెళ్లి జరుపుకోవడాన్ని విసినేషన్ వెడ్డింగ్ అంటారు. ప్రస్తుతం చాలామంది దీనినే ఎంచుకుంటున్నారు. ఫ్రెండ్స్, బంధువులు, ఆహ్వానితులు అందరూ తప్పక హాజరయ్యే అవకాశం ఉంటుంది. శుభకార్యంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేకమైన, సన్నిహిత అనుభవాన్ని (intimate experience) అందించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇదే బెస్ట్ గా భావిస్తున్నారు. విదేశాల్లోనో, ఇతర రాష్ర్టాల్లోనో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకునే కంటే.. స్థానికంగా జరుపుకోవడం వల్ల ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. పెళ్లిళ్ల లావాదేవీల వల్ల స్థానిక విక్రేతలు, వ్యాపారులకు మేలు జరుగుతుంది. అంటే విసినేషన్ వెడ్డింగ్స్ వల్ల కపుల్స్, వారి కుటుంబాలకే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి కూడా మేలు జరుగుతుంది.