- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రైవేట్ పార్ట్‌లో ఉల్లి గడ్డ స్మెల్.. దేనికి సంకేతం
దిశ, ఫీచర్స్: సాధారణం ప్రతి స్త్రీ యోని భిన్నమైన వాసన కలిగి ఉంటుంది. అపరిశుభ్రత, పీరియడ్స్, ఇన్‌ఫెక్షన్స్ ఇందుకు కారణం కావచ్చు కానీ ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుందని చెప్తున్నారు నిపుణులు. ఉల్లిపాయలు తింటే నోటి దుర్వాసన మాత్రమే వేజినల్ యోని కూడా అలాంటి స్మెల్‌ను రిలీజ్ చేస్తు్ందని చెప్తున్నారు. ఇలాంటి అసహ్యకరమైన వాసన ఎప్పుడు వస్తుంది? ఇలాగే కొనసాగితే ఏం చేయాలి? దేనికి సంకేతం? అనేది తెలుసుకుందాం.
యోనిలో ఉల్లిపాయలు లేదా వెల్లుల్లి వాసన
స్త్రీలు వారి హార్మోన్ల స్థాయిలు, పీరియడ్స్, గర్భనిరోధకాలు, ఆహారంలో మార్పుల కారణంగా యోని వాసనలో మార్పు వస్తుంది. ఆహారం తీసుకోవడం అనేది యోనిని ఆరోగ్యంగా ఉంచడంలో, ఆదర్శ pH స్థాయిని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఫుడ్ చేంజెస్ వేజినల్ మైక్రోఫ్లోరాను మార్చగలవు. కొన్ని ఫుడ్స్ తినడం వల్ల యోని వాసనను అందించే మైక్రోఫ్లోరా ఎసిడిక్ స్థాయి మారొచ్చు. ఇక ఆరెంజ్, గ్రేప్స్ వంటి సిట్రస్ ఫ్రూట్స్ యోని వాసనను స్వీట్‌గా మారిస్తే.. వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు వంటి బలమైన వాసన కలిగిన ఆహారాలు దుర్వాసనను కలిగిస్తాయి.
తిన్న ఆహారాన్ని శరీరం పూర్తిగా జీవక్రియ చేసిన తర్వాత యోని బలమైన ప్రత్యేకమైన వాసన పోతుంది. యోని వాసనలో మార్పుకు కారణమయ్యే ఆహార ఉత్పత్తులను వదిలివేయడం కూడా ప్రత్యేకమైన వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఉల్లిపాయలు, వెల్లుల్లి నుంచి కొంత బ్రేక్ తీసుకోవడం బెటర్. అయితే ఇదే స్మెల్ ఎక్కువ కాలం పాటు కొనసాగితే యోనిలో వాగినోసిస్ వంటి బ్యాక్టీరియా పెరుగుదల, ఇన్‌ఫెక్షన్‌కు కారణం కావచ్చు. ఈ స్మెల్‌తో పాటు దురద, నొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం బెటర్. ఇక కొన్ని సందర్భాల్లో హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం.. జిడ్డుగల ఆహారాలతో పోలిస్తే తేలికపాటి సువాసనను పొందడంలో సహాయపడుతుంది.
దుర్వాసన రాకుండా జాగ్రత్తలు
* యోని ప్రాంతాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. తద్వారా ఇన్ఫెక్షన్‌లు రాకుండా ఉంటాయి.
* చికాకును నివారించడానికి కాటన్‌తో తయారు చేసిన లోదుస్తులను ధరించండి.
* యోని సహజంగా అన్ని సమయాలలో తేమను విడుదల చేస్తుంది కాబట్టి క్రమం తప్పకుండా బిగుతుగా ఉండే ప్యాంటు ధరించడం మానుకోండి. తేమను కోల్పోలేకపోతే బ్యాక్టీరియా చేరిపోయి.. వాసన, చికాకును కలిగిస్తుంది.
* సెంటెడ్ వాష్‌లను ఉపయోగించడం మానుకోండి. ఇది మంచి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. చికాకు, ఇన్ఫెక్షన్‌కు దారితీసే pH బ్యాలెన్స్‌కు అంతరాయం కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి:
లిప్‌లాక్‌తో ఈ వ్యాధి బారిన పడ్డట్లే!
కొబ్బరి చెట్టుపై బోల్డ్ యాంగిల్స్.. ప్రైవేట్ పార్ట్ చూపించేసిన సంయుక్త