పంది కొవ్వు ఇంధనంగా వినియోగిస్తున్న ఫ్లైట్స్.. మరింత డేంజరస్..

by Anjali |   ( Updated:2023-06-06 10:22:28.0  )
పంది కొవ్వు ఇంధనంగా వినియోగిస్తున్న ఫ్లైట్స్.. మరింత డేంజరస్..
X

దిశ, ఫీచర్స్: చనిపోయిన పందులు, పశువులు, కోళ్ల కొవ్వును జెట్ ఇంధనాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఇది గ్రహానికి మరింత హానికరంగా మారుతుందని ఒక కొత్త అధ్యయనం హెచ్చరించింది. జంతువుల కొవ్వు నుంచి తయారు చేయబడిన ఇంధనం డిమాండ్ 2030నాటికి మూడు రెట్లు పెరగనుంది. విమానయాన సంస్థలు ఇందులో ముందు వరుసలో ఉన్నాయి. కానీ ప్రతీ ఏట ఈ డిమాండ్‌‌కు తగినట్లుగా పశువులు చనిపోవట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయం పామాయిల్ మాత్రమే అవుతుందని తెలిపింది బ్రస్సెల్స్‌కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ & ఎన్విరాన్‌మెంట్ అధ్యయనం. దీంతో కార్బన్ ఉద్గారాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

అధిక మొత్తంలో కార్బన్‌ను నిల్వచేసే పాత అడవులు కొత్త తోటల కోసం క్లియర్ చేయబడతాయని, పెరిగిన పామాయిల్ వినియోగం పెరుగుతున్న ఉద్గారాలతో ముడిపడి ఉందని వివరించింది. కాగా పారిస్ నుంచి న్యూయార్క్ ప్రయాణించే ఒక్క ఫ్లైట్ కోసం దాదాపు 8800 చనిపోయిన కొవ్వును ఇంధనంగా వినియోగించాల్సి వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో జంతువుల కొవ్వు అందుబాటులో ఉందని చెప్తోంది.

Also Read... ‘ఏడాదిలో కనీసం ఒక్క మొక్క అయినా నాటుదాం’

Advertisement

Next Story

Most Viewed