ఏకకాలంలో ఏసీ - ఫ్యాన్ వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

by Anjali |
ఏకకాలంలో ఏసీ - ఫ్యాన్ వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్: చూస్తుండగానే ఎండాకాలం రానే వచ్చేసింది. బయట ఎండలు భగ్గుమంటున్నాయి. జనాలు ఇంట్లో నుంచి బయటికెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఎండ నుంచి విముక్తి పొందడానికి ఇప్పటి నుంచే చాలా మంది పలు జాగ్రత్తలు వహిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు మహిళలు తప్పకుండా స్కార్ఫ్ యూజ్ చేయడం, మగవారు హెల్మెట్లతో పాటు గొడుగును తీసుకెళ్లడం.. బయట సలాడ్స్, సమ్ డ్రింక్స్ తాగడం చేస్తుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్నవారు చల్లదనం కోసం ఏసీలు ఏర్పాటు చేసుకుంటారు.

ఇన్ని రోజులు ఏసీని పట్టించుకోని వారు మళ్లీ ఏసీని ఆన్ చేసి.. పని చేస్తుందో లేదో చెక్ చేసుకుంటారు. లేకపోతే వెంటనే రిపేర్ కు ఇచ్చి బాగు చేయించుకుంటారు. కానీ ఏసీ లేకుండా మాత్రం ఉండలేరు. అయితే కొంతమంది ఫ్యాన్ గాలి కాస్త వేడిగా అనిపించడంతో ఏకకాలంలో ఏసీలు కూడా ఆన్ చేస్తుంటారు. కాగా ఒకే సమయంలో ఇలా చేస్తే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు ఫ్యాన్ వేస్తే ఏసీ పాడయ్యే అవకాశాలున్నాయా? రెండూ ఒకేసారి వేస్తే ఏమౌతుంది? అని చాలా మందికి సందేహాలు తలెత్తే ఉంటాయి. ఇలాంటి వారి కోసం తాజాగా నిపుణులు ఓ క్లారిటీ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏసీ వాడుతున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేస్తే ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. రెండు ఒకేసారి ఆన్ లో ఉంటే.. ఏసీ వేడి గాలిని కిందికి నెట్టివేస్తుంది. మీరు సీలింగ్ ఫ్యాన్‌ను ఏసీతో వాడితే గదిలోని గాలిని నెట్టేస్తుంది. ఇది గది మొత్తాన్ని కూల్ గా చేస్తుంది. అంతేకాకుండా ఫ్యాన్, రూమ్ లోని ప్రతి మూలకు చల్లగాలిని పంపుతుంది.

ఇక ఆ సమయంలో ఏసీ ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు రూమ్ లోని విండోస్, డోర్స్ క్లోజ్ చేయాలి. గదిలోని చల్ల గాలి బయటకు పోకుండా ఉంటుంది. వాస్తవానికి ఫ్యాన్‌ను ఏసీతో వాడినప్పుడు కరెంట్‌ను కూడా సేవ్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే ఒక్క విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏసీ ఉష్ణోగ్రత 24 నుండి 26 మధ్య ఉండాలి.

ఫ్యాన్‌ను కనిష్ట వేగంతో ఉంచాలి. ఇది ఫాలో అయితే గది తొందరగా కూల్ అవుతుంది. దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది. 6 గంటల పాటు ఏసీని యూజ్ చేసినప్పుడు ఖరీదు 12 యూనిట్లు. అదే సమయంలో, ఏసీతో ఫ్యాన్‌ను ఉపయోగించడం వల్ల ఖర్చు అయ్యేది 6 యూనిట్లు మాత్రమే. దీనివల్ల విద్యుత్ కూడా సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed