- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ ’రేబీస్ ఫ్రీ తెలంగాణ’.. వీధి కుక్కల నియంత్రణపై స్పెషల్ ఫోకస్
దిశ, తెలంగాణ బ్యూరో: ’రోడ్లపైన ఆహార పదార్థాలను విసిరేయడం, చెత్త పేరుకుపోవడంతోనే కుక్కల బెడద తీవ్రమవుతోంది. మున్సిపాలిటీల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. కుక్కల బెడద కూడా తగ్గుతుంది. పట్టణం పరిశుభ్రంగా ఉంటే సకల సమస్యలు పరిష్కారమైనట్టేనని‘ పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించారు. పట్టణాల్లో వీధి కుక్కల బెడద తగ్గించడంతో పాటు కుక్క కాటుపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ’రేబీస్ ఫ్రీ తెలంగాణ‘ లక్ష్యంతో పనిచేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది.
రాష్ట్రంలో 2.40లక్షల శునకాలు..
రాష్ట్రంలో 144 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 2.40లక్షల కుక్కలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు లక్ష కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీధి కుక్కల జనన నియంత్రణకు, రేబీస్ నివారణకు రాష్ట్రవ్యాప్తంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కుక్కలకు స్టెరిలైజేషన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. 100 మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణకు ఏదో ఒక రూపంలో కార్యక్రమాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 144 మున్సిపాలిటీల్లో 80 కేంద్రాల్లో అనిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) సెంటర్లు ఉన్నాయి. మిగిలిన 62 కేంద్రాల్లో ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు. ఆసిఫాబాద్, నిర్మల్ కేంద్రాల్లో ఏబీసీ సెంటర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. షాద్ నగర్, సిరిసిల్ల మున్సిపాలిటీల్లో ఫోర్టబుల్ ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఆపరేషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్ ను అక్కడి అధికారులు వినియోగించుకుంటున్నారు. కుక్కల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు.
స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం..
కుక్కల నియంత్రణకు స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. బ్లూక్రాస్ సొసైటీ, స్వతంత్ర సొసైటీ, యానిమల్ వెల్ఫేర్ సొసైటీ, నవోదయ వెటర్నరీ సర్వీసెస్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని ఆపరేషన్లు చేయడం, స్టెరిలైజేషన్ వంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. రేబీస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యల్లో ఎన్జీఓలను కూడా భాగస్వాములను చేయనున్నారు.
సమీప మున్సిపాలిటీల సేవలు..
కుక్కల నియంత్రణకు ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. కుక్కలను పట్టుకోవడానికి శిక్షణ పొందిన కార్మికులు, పట్టుకోవడానికి సామాగ్రి, వాటిని తరలించడానికి వాహనాలు కచ్చితంగా ఉండాలి. పట్టుకున్న కుక్కలను ఏబీసీ సెంటర్ తరలించడం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం, తర్వాత వాటికి అవసరమైన ఆహారాన్ని అందించడం వంటి చర్యలు తీసుకోవాలి. నిధుల కొరత కారణంగా కొన్ని మున్సిపాలిటీల్లో చేయలేకపోతున్నారు. అయితే సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్లు,మున్సిపాలిటీల సేవలను వినియోగించుకోవాలని ఆయా పట్టణాలకు పురపాలక శాఖ సూచించింది. దీంతోపాటు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యలయాలకు సమీపంలోనే ఉన్న మున్సిపాలిటీలు ఏబీసీ సెంటర్ల సేవలను వినియోగించుకునే అవకాశముంది. ఇతర రాష్ట్రాలతో పొలిస్తే తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణ, స్టెరిలైజేషన్, రేబీస్ నివారణ కార్యక్రమాలు మెరుగ్గా ఉన్నాయని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు.