- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐశ్వర్యరాయ్ వద్దు.. ఆ హీరోయిన్‌ని రెండో పెళ్లి చేసుకో.. అభిషేక్‌ని టార్చర్ చేస్తున్న తల్లి, సోదరి..?
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai)- అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో కలిసి నటించిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. అయితే గత కొన్ని నెలలుగా ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఈ జంట స్పందించలేదు. అయినప్పటికీ వీరి డివోర్స్ వార్తలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..?
ఐశ్వర్య రాయిని అభిషేక్ పెళ్లి చేసుకోవడం తన తల్లికి, సోదరికి ఇష్టం లేదట. అయితే వివాహం జరిగిన కొత్తలో అందరూ బాగానే ఉన్నట్టు కనిపించిన ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యాయట. దీంతో ఐశ్వర్యారాయ్ వేరే కాపురం పెడదామని కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. కానీ అభిషేక్ బచ్చన్ మాత్రం ఆ నిర్ణయాన్ని తిప్పి కొట్టారట. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్‌ను సోదరి, తల్లి జయ బచ్చన్(Jaya bachchan) కలిసి ఐశ్వర్యరాయికి విడాకులు ఇప్పించి కరిష్మా కపూర్(Karishma Kapoor)ని పెళ్లి చేయాలని చూస్తున్నారట.
ఎందుకంటే ఐశ్వర్యరాయ్ కంటే ముందే కరిష్మా కపూర్‌తో అభిషేక్ బచ్చన్‌కు ఎంగేజ్మెంట్ జరిగి కొన్ని కారణాలవల్ల క్యాన్సిల్ అయింది. దీన్ని మనసులో పెట్టుకున్న అభిషేక్ తల్లి ఐశ్వర్య రాయిని మొదటి నుంచే విమర్శిస్తూ వస్తుందట. ప్రస్తుతం ఫ్యామిలీలో గొడవలు రావడంతో తప్పకుండా ఐశ్వర్యకు విడాకులు ఇచ్చి కరిష్మా కపూర్‌ని పెళ్లి చేసుకోవాలని కొడుకుపై ఒత్తిడి చేస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో టాక్. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.