మహిళలకు Sex life లో ఉత్తమ నేస్తం ఇదే!

by Seetharam |   ( Updated:2022-08-30 09:04:41.0  )
మహిళలకు Sex life లో ఉత్తమ నేస్తం ఇదే!
X

దిశ, ఫీచర్స్ : మనుషుల్లో సెక్స్ కోరికలు వివిధ కారణాల వల్ల తగ్గిపోతుంటాయి. అలాగే సెక్స్ డ్రైవ్ బలంగా ఉన్నప్పటికీ చాలా మంది మహిళలు భావప్రాప్తి పొందలేకపోతుంటారు. అలాంటివారు బాడీలో స్వీట్ స్పాట్స్ ఎలా యాక్టివేట్ చేయాలన్న విషయంపై శ్రద్ధ వహిస్తే భావప్రాప్తి పొందడం సులభమే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. సెక్స్‌లో లూబ్ ఉపయోగించడం ద్వారా వెజీనా డ్రైనెస్‌ సమస్యకు చెక్‌పెడితే.. ప్లెజర్‌ను మెరుగుపరచుకోవడమే కాక భావప్రాప్తి పొందే అవకాశాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు.

ల్యూబ్ అంటే ఏమిటి? ఎందుకు ఉపయోగించాలి?

శృంగారంలో అవాంఛిత ఘర్షణను నివారించేందుకు ఉపయోగించే ద్రవం లేదా జెల్‌ను 'ల్యూబ్' అంటారు. ఇది యోని గోడలు రాపిడికి గురైనపుడు ఉత్పన్నమయ్యే వేడిని తగ్గించి రతి క్రీడ మరింత సాఫీగా జరిగేలా చేస్తుంది. పార్ట్‌నర్‌తో సెక్స్‌ లైఫ్‌ను మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకే ల్యూబ్స్ ఉపయోగిస్తారు. నిజానికి యోనిలో తగినంత లూబ్రికేషన్ లేకుంటే నొప్పి కలిగి భావప్రాప్తి కష్టతరమవుతుంది. పైగా భావప్రాప్తి పొందాలంటే ఉద్రేకం ముఖ్యం. ఇలాంటి సమస్యలతో పాటు మహిళలకు సెక్స్‌లో కలిగే అన్ని రకాల మంటలు, చికాకులను ల్యూబ్స్ నివారించి సంపర్కాన్ని మరింత సులభతరం చేస్తాయి. సున్నితమైన యోని ప్రాంతంలో కోతలు ఏర్పడకుండా తోడ్పడతాయి. లైంగిక సంక్రమణ వ్యాధులు సంక్రమించే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి. అదనంగా మరిన్ని లైంగిక ప్రయోగాలకు ప్రోత్సాహాన్నిస్తాయి. అంతేకాదు కండోమ్ లోపల ఒక డ్రాప్ ల్యూబ్ వేయడం వల్ల అవి పగిలిపోకుండా నిరోధించవచ్చు.

మెరుగైన భావప్రాప్తికి కీలకమా?

రాపిడిని తగ్గించడం, సౌలభ్యం కల్పించడం, ఆనందాన్ని పెంచడం లక్ష్యంగా రకరకాల ల్యూబ్స్ అందుబాటులో ఉన్నాయి. ఏది సూట్ అవుతుందో ఎంచుకోవడమనేది వ్యక్తిగత ప్రాధాన్యత. నీటిలో కరిగే ద్రవ లిక్విడ్, జెల్లీ టైప్ పర్సనల్ లూబ్రికెంట్ లైంగిక ఆనందాన్ని పెంచుతుంది. వెజీనల్ డ్రైనెస్ అనుభవించే మహిళలకు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

అదే పనిగా సెక్స్‌లో పాల్గొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

కపుల్ కాదు.. ట్రిపుల్ : ఒక్కడినే పంచుకున్న ఇద్దరు యువతులు

సెక్స్ కావాలని రెచ్చగొట్టినా ఆయన పట్టించుకోలేదు.. అందుకే విడాకులిచ్చేశా

Advertisement

Next Story

Most Viewed