పిల్లలను స్కూల్‌కు పంపిస్తే టైం బొక్క??.. ఫోన్ చేతికిచ్చి ఈ తల్లి లెక్క జేస్తే డబ్బే డబ్బు..

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-02 11:17:06.0  )
పిల్లలను స్కూల్‌కు పంపిస్తే టైం బొక్క??.. ఫోన్ చేతికిచ్చి ఈ తల్లి లెక్క జేస్తే డబ్బే డబ్బు..
X

దిశ, ఫీచర్స్: పిల్లలు పుట్టగానే ముందు సంబరపడుతాం. వాళ్లను చూసుకుని మురిసిపోతం. కానీ స్కూల్ కు వెళ్లే ఏజ్ వచ్చాక పేరెంట్స్ కి బ్యాండ్ మోగిపోతుంది. బుక్స్, ఫీజు, యూనిఫామ్ అంటూ సవాలక్ష చెప్తూ.. డబ్బులు లాగేసుకుంటాయి పాఠశాల యాజమాన్యాలు. అవన్నీ కడితే తప్ప పరీక్షలు రాయనివ్వమని హెచ్చరిస్తాయి. గడువులోపు కట్టకపోతే పిల్లలకు పనిష్మెంట్ సరేసరి. ఇక మోతకోలు బుక్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దీంతో ఇంత ఇబ్బంది లేకుండా పిల్లలని ఇంట్లోనే ఉంచేసి.. స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంది ఓ తల్లి. ఇప్పుడే వారు డబ్బు సంపాదించేలా తీర్చిదిద్దుతుంది.

UK కు చెందిన అమండకు ముగ్గురు ఆడపిల్లలు. ముందు వీరిని పాఠశాలకు పంపింది కానీ దీనివల్ల నేర్చుకోవడానికి కొత్తగా ఏమీ లేదని ఈజీగా గ్రహించింది. తనే ఇంట్లో పుస్తకాల్లోని పాఠాలు చెప్పడంతో పాటు ప్రజెంట్ జనరేషన్ కు తగినట్లుగా ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ గురించి నేర్పుతుంది. దీనివల్ల యంగర్ ఏజ్ లోనే తన బిడ్డలు సంపాదిస్తారని, ఇండిపెండెంట్ గా ఉంటారని అంటుంది. ఇందులో నైపుణ్యం పొందితే ఫోన్ చేతిలో ఉంటే చాలు అన్ లిమిటెడ్ మాసివ్ ఇన్ కమ్ ఎప్పుడైనా, ఎక్కడైనా సంపాదిస్తరని చెప్తుంది. అందుకే ఈ ట్రేడింగ్ ఆర్ట్ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పిస్తే బాగుంటుందని సూచిస్తుంది.

Read More..

శాస్త్రవేత్తల సరికొత్త ఆవిర్భావం.. చెట్ల కంటే వేగంగా కార్బన్‌ను గ్రహించే విష వాయువులను తొలగించే 'పదార్థం'

Advertisement

Next Story