'అంత అతి ప‌నికిరాదు..' ఓ ఐపీఎస్ అధికారి ట్విట‌ర్ వీడియో వైర‌ల్‌

by Sumithra |
అంత అతి ప‌నికిరాదు.. ఓ ఐపీఎస్ అధికారి ట్విట‌ర్ వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్‌డెస్క్ః స్మార్ట్ ఫోన్ రాగానే సొసైటీలో విప‌రీత‌మైన మార్పు వ‌చ్చింద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే, కొన్ని వింత చేష్ట‌లు కూడా ప్ర‌జ‌ల్లో, ముఖ్యంగా యువ‌త‌లో మ‌రింతగా పెరిగిపోయాయి. ఇలాంటి సంద‌ర్భమే ఒక‌టి ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్, దీపాంశు కబ్రా, ఐపీఎస్‌కు ఎదుర‌య్యింది. బుధవారం ఆయన తన అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'అతి స‌ర్వ‌త్రా వ‌ర్జ‌యేత్' అనే క్యాప్ష‌న్ పెట్టిన ఈ వీడియోలో, ఓ ట్రాఫిక్‌ కూడ‌లి ద‌గ్గ‌ర ఇద్ద‌రు యువ‌కులు స్మార్ట్ ఫోన్‌తో ఫోటోలు దిగుతుంటారు. రెడ్ లైట్ ప‌డ‌టంతో వాహనాలన్నీ ఒక వైపు ఆగిపోయిన‌ప్పుడు, ఇద్దరు యువకులు ట్రాఫిక్ పోలీసు కూర్చునే క్యాబిన్‌లోకి వెళ్లి ఫోటోలు క్లిక్ చేస్తుంటారు.

ఇక‌, ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌పైన‌ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వ్య‌క్తిగ‌త ఇష్టాల కోసం ప‌బ్లిక్‌కు ఇబ్బంది క‌లిగించ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. యువ తరంలో మొబైల్ ఫోన్ వినియోగం విప‌రీత ధోర‌ణుల‌కు దారితీస్తోంద‌ని ఒక‌ప‌క్క‌ సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఇంటర్నెట్ సదుపాయం, మొబైల్ ఫోన్ల వినియోగం యువత ఉజ్వ‌ల భ‌విష్య‌త్తుకు విఘాతం కలిగిస్తుందన్నది కొంద‌రు వాదిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed