గుడ్ రిలేషన్‌షిప్ కోసం ఇలా చేయండి..

by Vinod kumar |   ( Updated:2023-03-12 17:16:49.0  )
గుడ్ రిలేషన్‌షిప్ కోసం ఇలా చేయండి..
X

దిశ, ఫీచర్స్: రిలేషన్‌షిప్‌లో తరచూ సమస్యలు ఎదురవుతుంటే లైఫ్‌లో హాప్పినెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సంబంధాలు బలపడాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒకరిపట్ల ఒకరికి నమ్మకం, పరస్పర సహకారం, సాన్నిహిత్యం చాలా ముఖ్యమైమని చెప్తున్నారు. సంబంధాలమధ్య తగాదాలు, అపార్థాలు భార్యా భర్తలు, లేదా ప్రేమికుల మధ్య ఆప్యాయత, అనురాగాలను దూరం చేస్తాయని, వాటికి చెక్ పెట్టేందుకు ఈ కింది అంశాలను ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

* రిలేషన్ షిప్‌లో సమస్య తలెత్తినప్పుడు కలిసి మాట్లాడుకోవాలి. పరస్పరం గౌరవించుకోవాలి. ప్రతీ చిన్న విషయానికీ చర్చకు పెట్టి ఒకరిపై ఒకరు అరచుకోవడం, అవమానించడం అనేవి అస్సలు చేయకూడదు. పొరపాట్లు జరిగినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు వేరే వ్యక్తులవద్ద భాగస్వామి లోపాలను ఎత్తిచూపవద్దు.


* భార్యా భర్తల మధ్య పరస్పర నమ్మకం చాలా ముఖ్యం. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు అస్సలు అవకాశం ఉండకుండా చూసుకోవాలి. భాగస్వామి తనకు సంబంధించి గతంలో జరిగిన ఘటనలు, రహస్యాలు, సంబంధాలు ఇలా చాలా విషయాలను పంచుకుంటున్నారంటే.. ఎదుటి వ్యక్తిపట్ల నమ్మంతోనే కదా. అలాంటప్పుడు వారి బలహీనతలను ఆసరగా తీసుకుని వేధించడమో, ఇబ్బందికి గురిచేయడమో చేయకూడదు.

* నమ్మక ద్రోహం, మోసం వంటివి చేయకూడదు. ఎంత మంచి సంబంధాన్నయినా ఇటువంటి ప్రవర్తన విచ్ఛిన్నం చేస్తుంది. నమ్మకంలేని బంధం ఎప్పుడూ నిలబడదు. భాగస్వాముల మధ్య ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, నమ్మకంలేకపోతే వారి జీవితం సాఫీగా సాగదు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచరణలు, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాల విషయంలో కూడా ఇద్దరివీ అచ్చం ఒకేలా ఉండాలని లేదు. పలు విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నా సర్దుకోవాలి.

ఇవి కూడా చదవండి : ఆ ఊర్లో మహిళలంతా నగ్నంగానే.. 5 రోజులపాటు మగాళ్లంతా అలా చేయాల్సిందే..

Advertisement

Next Story