Trending : ఏ పని చేయకుండానే లక్షలు సంపాదిస్తున్న మహిళ.. జస్ట్ ఫొటోలు తీసుకుంటూ..

by Javid Pasha |
Trending : ఏ పని చేయకుండానే లక్షలు సంపాదిస్తున్న మహిళ.. జస్ట్ ఫొటోలు తీసుకుంటూ..
X

దిశ, ఫీచర్స్ : చేతిలో డిగ్రీలు ఉన్నంత మాత్రాన సరిపోదు. జీవితంలో సంతోషంగా బతకాలంటే ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిందే. ఏ పనీ చేయకుండా సంపాదించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఓ మహిళకు మాత్రం సాధ్యమైంది. ప్రస్తుతం ఆమె ఎటువంటి జాబ్ చేయడం లేదు. అయినప్పటికీ నెలకు లక్షల్లో సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది కూడా జస్ట్ ఫొటోలు తీసే అలవాటు కారణంగా లక్షలు గడిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

ఆమె పేరు అలెగ్జాండ్రా హోల్మాన్. అమెరికాకు చెందిన ఈ 25 ఏండ్ల మహిళ కేవలం ఆర్నెల్ల కాలంలోనే రూ. 58 లక్షలకు పైగా సంపాదించింది. ప్రస్తుతం నెలకు దాదాపు రూ. 10 లక్షలు సంపాదిస్తోందట. అంత మొత్తంలో ఎర్న్ చేస్తోందంటే ఏదో పెద్ద ఉద్యోగం చేస్తుందని అనుకుంటారు. కానీ అలెగ్జాండ్రా మాత్రం అలాంటిదేమీ చేయడం లేదు. కేవలం మొబైల్‌ ఫోన్‌లో తన ఫొటోలు మాత్రమే తీసి వాటిని సోషల్ మీడియాలో, వివిధ వెబ్‌సైట్లు, మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనలుగా ఉపయోగించడానికి సదరు కంపెనీలకు విక్రయిస్తుందట.

అలెక్స్ సీటెల్ యూనివర్సిటీ నుంచి ఫిల్మ్ మేకింగ్‌‌లో పట్టా పొందిన అలెగ్జాండ్రా ఆ తర్వాత స్థానిక కాఫీ షాప్‌లు, రెస్టారెంట్ల కోసం, అలాగే వర్జిన్ గెలాక్టిక్ లోరియల్ వంటి ఫేమస్ బ్రాండ్లకోసం ఓన్‌గా కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినట్లుగా తెలిపింది. అంతేకాకుండా బ్యూటిపుల్ లొకేషన్స్‌లో దిగిన ఫొటోలను ఆయా బ్రాండ్లకు ట్యాగ్ చేస్తూ తన ఓన్ కంటెంట్‌ను అటాచ్ చేస్తూ షేర్ చేయడం ప్రారంభించింది. దీంతో ఆమెకు ఫాలోవర్లు పెరిగిపోయారు. మంచి రెస్పాన్స్ రావడంతో ఆయా కంపెనీలు తమ బ్రాండ్ల అడ్వర్టైజ్‌మెంట్లలో ఆ మహిళ ఫొటోలను యూజ్ చేసుకోవడానికి డబ్బులు చెల్లించడం మొదలుపెట్టాయి. దీంతో ఆమె ప్రస్తుతం నెలకు రూ. 10 లక్షల వరకు సంపాదిస్తోందట. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ‘నీ పని బాగుంది. ఏ పని చేయకుండానే నెలకు లక్షల్లో సంపాదిస్తున్నావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed