టచ్ స్క్రీన్ ఎయిర్‌పాడ్స్.. వీడియో కాల్స్‌, మూవీస్ చూసేయొచ్చు..

by Harish |   ( Updated:2023-04-07 11:38:16.0  )
టచ్ స్క్రీన్ ఎయిర్‌పాడ్స్.. వీడియో కాల్స్‌, మూవీస్ చూసేయొచ్చు..
X

దిశ, ఫీచర్స్: టెక్ దిగ్గజం Apple కొత్త పేటెంట్‌ను ప్రచురించింది. AirPods ఛార్జింగ్ కేస్‌కు టచ్ డిస్‌ప్లేను జోడించబోతున్నట్లు తెలిపింది. ఇది యూజర్స్ యాప్‌లను యాక్టివేట్ చేసేందుకు, కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసేందుకు, మూవీస్ చూసేందుకు అనుమతిస్తుంది. ఈ ఇన్నోవేషన్ ప్రైమరీ ఫోకస్.. ఐఫోన్‌ పట్టుకోకుండానే నిర్దిష్ట సమాచారాన్ని యాక్సెస్ చేయగలగడం. కాగా ఆడియో బుక్స్, మ్యాప్స్, iMessage, వెదర్ యాప్‌కి యాక్సెస్‌ని అనుమతించే ఫీచర్‌ను డాక్యుమెంట్ వివరిస్తుంది. కేస్ మూసివేసే చోట స్క్రీన్ ముందు భాగంలో ఉంటుందని.. Apple హోమ్ డివైజ్‌‌కు కనెక్ట్ అయినట్లుగా ఫొటోస్ పోస్ట్ చేసింది.

ఆపిల్ ఇంటరాక్టివ్ స్క్రీన్ యూజర్‌ నుంచి ఇన్‌పుట్‌ల సంఖ్యను తగ్గిస్తుంది. మరింత సమర్థవంతమైన హ్యూమన్-మెషిన్ ఇంటర్‌ఫేస్‌ను ఉత్పత్తి చేస్తుంది. Patently Apple ద్వారా మొదట నివేదించబడిన పేటెంట్.. సెప్టెంబర్ 19, 2022న US పేటెంట్ & ట్రేడ్‌మార్క్ కార్యాలయంలో దాఖలు చేసింది. స్క్రీన్ వినియోగదారులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే దాని గురించి వివిధ సందర్భాలను వివరించింది.

అయితే ఇది AirPodsలో ప్రస్తుత టచ్ నియంత్రణలను భర్తీ చేయదు. కేసు ముందు భాగంలో ఉన్న ఆప్టికల్ సెన్సార్ సెల్ఫీలను తీయడానికి, వీడియో కాన్ఫరెన్స్‌లను అనుమతించడానికి కెమెరాను కలిగి ఉంది. ఆపిల్ స్టాక్స్, కాలిక్యులేటర్, క్లాక్ వంటి యాప్‌లకు యాక్సెస్‌ను కూడా అనుమతిస్తుంది. ఛార్జింగ్ కేస్ అంతర్నిర్మిత హాప్టిక్ టచ్ నియంత్రణలను కలిగి ఉండగా.. వినియోగదారు కేస్‌ను స్క్వీజ్ చేసినప్పుడు, ఆడియో మోడ్‌లను మార్చినప్పుడు ఇవి యాక్టివేట్ చేయబడతాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి: ‘పెళ్లి చేసుకోని పిల్లల కోసం తప్పు పనులు చేస్తారు..’ ఎగ్జామ్‌లో విద్యార్థి షాకింగ్ ఆన్సర్!

Advertisement

Next Story