- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలు మరీ ఎక్కువగా టీవీ చూస్తున్నారా?.. పెద్దయ్యాక జరిగేది తెలిస్తే షాక్ అవుతారు !
దిశ, ఫీచర్స్: వినోద కార్యక్రమాలు, అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో కొంత మేలు చేస్తాయని మనకు తెలుసు. వాటివల్ల పొందే ఆనందం అందుకు దోహదం చేస్తుందని నిపుణులు చెప్తుంటారు. కానీ ఒక రకమైన వినోదం అనారోగ్యనికి కూడా కారణం కావచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అదేంటంటే.. చిన్నప్పటి నుంచి ఎక్కువగా టీవీ చూసే అలవాటు ఉన్నవారు, పెద్దయ్యాక జీవక్రియ సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. యుక్త వయస్సులో టెలివిజన్కు అతుక్కుపోయే వారిలో మెటబాలిక్ సిండ్రోమ్ డెవలప్ అవుతుందని ఒటాగో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఎక్కువగా స్ర్కీన్ చూడటం ఆరోగ్యానికి మంచిది కాదని గత అధ్యయనాలు వెల్లడించినప్పటికీ, తాజా సమాచారం అందుకు మరింత బలం చేకూర్చుతూ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అందించిందని నిపుణులు చెప్తున్నారు.
మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక బ్లాంకెట్ మెడికల్ టెర్మ్గా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, హై బ్లడ్ షుగర్, హైపర్ టెన్షన్, అబ్ నార్మల్ కొలెస్ట్రాల్ లెవల్స్ సమస్యలతోనూ ముడిపడి ఉంటుందని చెప్తున్నారు. అధ్యయనంలో భాగంగా ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బాబ్ హాంకాక్స్ నేతృత్వంలోని పరిశోధకులు ఎక్కువగా టీవీ చూసే చిన్న పిల్లలు, పెద్దయ్యాక వారి జీవన విధానం, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునేందుకు 879 మంది వ్యక్తులకు సంబంధించిన డేటాను విశ్లేషించారు. ఇందులో 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సులో ఎక్కువగా టెలివిజన్ చూసేవారు మాత్రమే తమ 45 ఏళ్ల వయస్సులో జీవక్రియ సంబంధిత సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ‘ఎక్కువగా వీక్షించిన వారికి యుక్తవయస్సులో మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది’ అని ప్రొఫెసర్ హాంకాక్స్ తెలిపారు. అంతేగాక బాల్యంలో అధికంగా టీవీచూసే అలవాటు తర్వాతి జీవితంలో అధిక బరువు, ఊబకాయం, శారీరక దృఢత్వం లేకపోవడం వంటి సమస్యలకు కూడా కారణం అవుతుందని పేర్కొన్నారు.