ఈరోజు ప్రత్యేకత: 'వరల్డ్ స్టాటిస్టిక్స్ డే'..

by Hamsa |
ఈరోజు ప్రత్యేకత: వరల్డ్ స్టాటిస్టిక్స్ డే..
X

దిశ, ఫీచర్స్: 'వరల్డ్ స్టాటిస్టిక్స్ డే' అనేది గణాంకాలను సెలబ్రేట్ చేసుకునే అంతర్జాతీయ దినోత్సవం. యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమీషన్ ద్వారా రూపొందించబడిన ఈ దినోత్సవం.. మొదటిసారిగా 20 అక్టోబర్ 2010న నిర్వహించారు. అక్కడ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుండగా.. ఇప్పటి వరకు 103 దేశాలు జాతీయ గణాంకాల దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఇందులో 51 ఆఫ్రికన్ దేశాలు సంయుక్తంగా ఆఫ్రికన్ స్టాటిస్టిక్స్ డేని ఏటా నవంబర్ 18న సెలబ్రేట్ చేసుకుంటుండగా.. భారతదేశం తన గణాంకాల దినోత్సవాన్ని జూన్ 29న గణాంకవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ పుట్టినరోజు జరుపుకుంటుంది. UKలోని రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ కూడా అక్టోబర్ 20న గెట్‌స్టాట్స్ స్టాటిస్టికల్ లిటరసీ ప్రచారాన్ని ప్రారంభించింది.

Advertisement

Next Story

Most Viewed