- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే-31: నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
దిశ, వెబ్డెస్క్: నేడు మే-31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సభ్య దేశాలు 1987లో ప్రపంచ హెల్త్ అసెంబ్లీ డబ్లూహెచ్ఎ 40.38 తీర్మానాన్ని ఆమోదించింది. ఏప్రిల్ 7, 1988ని ప్రపంచ ధూమపాన నిరోధక దినంగా పాటించాలని పిలుపునివ్వడం జరిగింది. పొగాకు అంటే సిగరెట్లు, చుట్టలు, బీడీలే కాదు. గుట్కా, ఖెనీ, జల్దా వంటివి కూడా. ఇవి కూడా పొగాకు కిందకే వస్తాయి. అవి వాడిన మరుక్షణం నుంచే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పొగలోని నికొటిన్ మనల్ని వీటికి బానిస చేస్తుంది. పొగాకు తాగటం వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బులు రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజుకు 20 సిగరేట్లు తాగే వారితో పోలిస్తే ఒకటి, రెండు తాగిన వారికి గుండె పోటు వచ్చే అవకాశం 40-50 శాతం ఉంటుంది. పొగ తాగినప్పుడు మన శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక్కసారిగా రక్తం గడ్డలు కట్టేలా చేస్తుంది. పొగ తాగే వారి జీవిత కాలం పదేళ్లు తగ్గుతుంది.
పొగాకు వల్ల రక్త నాళాలు సంకోచించి, తాత్కాలికంగా రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. తక్కువ నికొటిన్ గల సిగరేట్లు, చుట్టలు, బీడీలు కూడా ప్రమాదకరమే. కాగా పొగాకు మానేసిన ఐదేళ్లకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. సిగరేట్లు మానలేని వారు నికొటిన్ ప్యాచ్లు వాడితే ప్రయోజనం ఉంటుంది. పొగాకు ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల దీర్ఘకాల లంగ్స్ సమస్య సీవోపీడీకి (క్రానిక్ అబ్స్ట్రక్టిన్ పల్మానరీ డిసీజ్)కు దారి తీయొచ్చు.
అలాగే పొగాకు పొగలోని నికొటిన్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు దారితీస్తుంది. పొగతాగే మగవారి వీర్యంలోకి నికొటిన్ చేరుకుంటుంది. దీని మూలంగా శుక్ర కణాలు దెబ్బతిని, సంతానంపై ప్రభావం చూపుతాయి. ఆడవారు సిగరెటు తాగినట్లయితే.. వారు గర్భం దాల్చాక పిండం ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఇది మనలోని రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తుంది.
Read More... భూమిపై మరణం లేని జీవి ఇదొక్కటే..! దానికదే సెక్స్..