- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ఇడ్లీ డే.. మరెందుకు లేటు టేస్ట్ చేయండి!
దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం లేవగానే, టిఫిన్ అంటే టక్కున అందరికీ గుర్తువచ్చేది ఇడ్లీ. దోశ, పూరి, ఉప్మా ఇలా ఎన్ని ఉన్నా.. ఇడ్లీ ప్రత్యేకత ఇడ్లీదే. ఉదయం లేవగానే, సాంబర్, చట్నీతో ఇడ్లీ తిన్నామంటే, ఆ ఫీలింగే వేరుంటుంది. ఏంటీ ఈరోజు ఉదయాన్నే ఇండ్లీ గురించి చెబుతుంది అనుకుంటున్నారా.. ఎందుకంటే నేడు వరల్డ్ ఇడ్లీ డే.
మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎర్త్ డే అలా అన్నింటికీ ప్రత్యేకమైన రోజు ఉన్నట్లుగానే, ఇడ్లీకి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. మార్చి 30 వ తేదీని ఇడ్లీ రోజుగా పాటిస్తారు. 2015లో చైన్నైకి చెందిన ఇడ్లీ క్యాటరర్ ఎనియావన్ దీనిని గుర్తించాడు. ఈ రోజును జరుపుకోవడం కోసం ఎనియవన్ సుమారు 1,328 రకాల ఇడ్లీలను తయారు చేసి ఇడ్లీ ప్రత్యేకతను చాటి చెప్పాడు. అంతేకాదు.. ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏకంగా 44 కిలో ఇడ్లీని కట్ చేసి సంబరాలు చేశాడు.
అంతే కాకుండా ఇడ్లీ పుట్టింది కూడా ఇండియాలో కాదంట. పుట్టలేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇడ్లీ అంటే సాధారణంగా దక్షిణాది వంటకం అని భావిస్తాం. కానీ, కేటీ ఆచార్య అనే ఫుడ్ హిస్టరియన్ మాత్రం ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందని చెబుతున్నారు.
ఇడ్లీలో రకాలు చూసేద్దాం..
ఇండ్లీ పిండితో..
ఒకకప్పు మినపప్పు, ఐదుకప్పుల ఇడ్లీ రవ్వ 5 గంటల సేపు నానబెట్టుకోని , మనం ఇడ్లీ తయారు చేసుకుంటాము. చాలా మంది ఇడ్లీని ఎక్కువగా ఇలా తయారు చేస్తుంటారు.
గ్రీన్ లీఫ్ ఇడ్లీ..
ముందుగా నాలుగు స్పూన్ల కరివేపాకు పొడి, రెండు స్పూన్ల కారం ఓ పాత్రలో వేసుకోవాలి. నచ్చిన ఆకుకూరలు సన్నగా తరిగి లేదా గ్రైండ్ చేసుకుని అందులో వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత, పిండిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రల్లో పోయాలి. కుక్కర్‌ను ఓ మోస్తరు మంట మీద ఉంచితే సరిపోతుంది.
ఓట్స్ ఇడ్లీ..
వోట్స్.. మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇడ్లీనే ఆరోగ్యం అంటే.. ఓట్స్ ఇడ్లీ అంటే ఇంకా స్పెషల్ అని చెప్పాలి. ఓట్స్ ఇడ్లీలో చాలా పోషకాలు ఉంటాయి. దీనిని జీవనశైలిలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందనడం ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి: ఆ ప్లేస్‌లో ముక్కు పుడక పెడితే.. పీరియడ్స్ సమస్యలకు చెక్ !
- Tags
- World Idli Day