జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఈజీగా ఇలా హెయిర్ మాస్క్ చేసుకోండి!!

by Kanadam.Hamsa lekha |
జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఈజీగా ఇలా హెయిర్ మాస్క్ చేసుకోండి!!
X

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో ప్రతిఒక్కరికీ జుట్టు అధికంగా రాలిపోతుంటుంది. కొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య తీరదు. ముఖ్యంగా ఫ్రిజ్జీ హెయిర్ ఉన్నవారికీ ఎక్కువగా రాలిపోతుంది. కొంతమంది అమ్మాయిలు పొడవాటి జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తలస్నానం చేసిన తరువాత జుట్టు తొందరగా ఆరాలనే ఉద్ధేశంతో చాలా మంది హెయిర్ డ్రై వాడుతుంటారు. ఇవి జుట్టు పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా, హెయిర్‌ను డ్యామెజ్ చేస్తాయని నిపుణులు సూచించారు. అయితే, రెగ్యులర్‌గా ఈ చిన్న టిప్స్ పాటించారంటే జుట్టుకు మాయిశ్చరైజర్ అంది..ఈ సమస్య తగ్గుతుంది. మరి ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

కలబంద, మందారం: అలోవెరా, మందారం ఈ రెండు జుట్టుకు పోషణను అందిస్తుంది. కలబందలో ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా ఉంచుతుంది. ఈ రెండిటిని కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. మందారం పువ్వులు, అలోవెరా జెల్ రెండిటిని కలిపి పేస్ట్‌‌‌‌‌‌లా చేసుకోవాలి. దీనిని తలకు అప్లై చేసుకొని, 20 నుండి 30 నిమిషాలు ఉంచాలి. తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్, గుడ్డు: జుట్టు రాలకుండా సిల్కీగా ఉండటానికి ఈ రెండు ఉపయోగపడతాయి. ఇది జుట్టుకు పోషణ అందించడమే కాకుండా ఎత్తుగా పెరిగేలా చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్‌‌లో గుడ్డు వేసి బాగా కలపాలి. నూనెలో గుడ్డు పూర్తిగా కలిసిన తరువాత కుదుళ్ల నుంచి జుట్టుకు అప్లై చేయాలి. 30 నిమిషాల తరువాత చల్లటి నీటితో వాష్ చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే ఫలితం ఉంటుంది.

మెంతులు: మెంతుల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టును కుదుళ్ల నుంచి బలంగా మారుస్తుంది. మెంతులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని పేస్ట్‌లా చేసుకుని తలకు అప్లై చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. అయితే, వాష్ చేసేటప్పుడు తక్కువ గాఢత ఉన్న షాంపులను ఉపయోగించి వాష్ చేయడం మంచిది.

ఈ చిన్నపాటి టిప్స్‌ను మీరు రెగ్యులర్‌గా ఫాలో అయితే, మీ జుట్టు ఒత్తుగా, దృఢంగా మారుతుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.Telugu News , Latest Telugu news , Latest News in Telugu

Advertisement

Next Story