- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
80 శాతం మందిని వేధిస్తున్న మార్నింగ్ సిక్‌నెస్.. బయటపడే మార్గాలివే
దిశ, ఫీచర్స్ : ప్రెగ్నెన్సీ సమయంలో 80 శాతం మంది మహిళలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ లక్షణాల్లో మార్నింగ్ సిక్‌నెస్ ఒకటని వైద్య నిపుణులు చెప్తున్నారు. తరచూ వాంతులు, వికారం వంటి ఇబ్బందులతో ఈ పరిస్థితి తీవ్రమవుతుంది. ఆహారం తినలేని పరిస్థితివల్ల ఎనర్జీని కోల్పోతుంటారు. కొందరైతే కనీసం కూర్చోవడానికి, మాట్లాడటానికి కూడా ఓపికలేనంతగా అలసిపోతుంటారు. అయితే ఈ సమస్యలు ఉదయంపూటనే ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి మార్నింగ్ సిక్‌నెస్ అంటారు. అలాగని మిగతా సమయాల్లో ఉండవని మాత్రం కాదు. రోజులో ఏ సమయంలోనైనా గర్భిణులు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చు. అయితే అధిగమించేందుకు ఏం చేయాలనే సందేహాలు తలెత్తుంటాయి. అందుకు నిపుణులు చెప్తున్న సలహాలేంటో పరిశీలిద్దాం.
వికారం, వాంతులు, ఒక రకమైన స్మెల్‌తో ఆహారం తినకపోవడమే గర్భిణుల్లో మార్నింగ్ సిక్‌నెస్‌కు ప్రధాన కారణం. కాబట్టి ఒకేసారి భోజనం చేయకుండా రోజంతా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడంవల్ల మేలు జరుగుతుంది. ఇది బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను, పండ్లను ఎంచుకోవాలి. పాలు, పెరుగు, అల్లం, ఖర్జూరాలు, మిల్లెట్స్, కిచిడీ వంటివి తీసుకోవాలి. వీటితోపాటు విటమిన్ బి6, బి12 లభించే ఆహారాలు వాంతులు, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలసటను దూరం చేస్తాయి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఓట్స్, వేరుశనగ, అరటిపండు, పాలు, చికెన్, చేపలు, ఆకుకూరలు మీరు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇక నాన్‌వెజ్ తినలేని వారు పాలు చీజ్, గుడ్లు, తృణధాన్యాల ద్వారా వీటిని పొందవచ్చు. అయితే ఫ్యాట్, షుగర్, యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను మాత్రం నివారించాలి. ఎందుకంటే ఇవి వాంతులు, వికారాన్ని మరింత పెంచుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి సరిపడా నీళ్లు తాగాలి. అలాగే విశ్రాంతి, నడక కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇంకా రిలాక్సేషన్ కోసం ఎటువంటి వ్యాయామాలు, మందులు, ఆహారాలు అవసరమో వైద్య నిపుణులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్‌నెస్ సమస్యలను అధిగమించవచ్చు.