- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే.. చేయాల్సింది ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి.. ఎన్నో అనారోగ్య సమస్యలకు లోనవుతుంటారు. నిర్జలీకరణం, ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం, హై బీపీ వంటి మరెన్నో వ్యాధుల బారిన పడుతారు. అయితే హెల్తీగా ఉండాలంటే కాలానుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని, నిపుణులు చెబుతున్నారు. అవెంటో చూద్దాం..
* ఏ కాలంలోనైనా సరే బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ముఖ్యంగా సమ్మర్‌లో.. ఎందుకంటే మండుతున్న ఎండల వల్ల చెమట రూపంలో నీరు ఎక్కువ మొత్తంలో బయటకు పోయి, దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడే ఛాన్స్ ఉంటుంది.
*అందుకోసం నీరు పుష్కలంగా తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగ్గా పనిచేస్తుంది.
*అలాగే ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. 30 నిమిషాల పాటు మీ శరీరాన్ని కదిలేటట్టు నడవడం ఎంతో మంచిది.
* ప్రస్తుత రోజుల్లో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ నిద్రలేమి సమస్య వల్ల డయాబెటిస్, డిప్రెషన్, ఊబకాయం వంటి ఎన్నో అనారోగ్య సమస్యల బారీన పడుతారు. దీని నుంచి బయటపడడానికి ప్రతి రోజూ ఓకే సమయానికి నిద్రించడం, లేవడం అలవాటు చేసుకోండి.
అలాగే పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను వాడకండి. ఇలా చేస్తే తప్పకుండా మీరు తొందరగా నిద్రలోకి జారుకుంటారు. కాగా 7 గంటల సమయం నుంచి 8 గంటలు సరిపడ నిద్ర ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
* వేసవిలో ఎక్కువగా ఫ్రుట్స్, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులనే తినండి.
* అలాగే ప్రాసెస్ చేసిన, కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం మానేయండి.
* అధిక నీటిని, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తాగండి.
* వేయించిన ఆహారాలకు బదులుగా కాల్చిన, ఉడకబెట్టిన ఫుడ్‌ను తీసుకోండి.
* ఈ చిట్కాలు పాటించడం వల్ల వేసవికాలంలో ఎలాంటి రోగాలు మీ దరిచేరకుండా ఉంటాయి. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.