- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cancer : టిష్యూ ఇంజనీరింగ్.. క్యాన్సర్ నివారణలో ఇదే కీలకం!
దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రతీ ఆరుగురిలో ఒకరు దీని బారిన పడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. 2020లో దాదాపు 10 మిలియన్ల మంది మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణం. ఇక 2026 నాటికి మన దేశంలో ఏటా 20 లక్షల మంది క్యాన్సర్‌తో మరణించే అవకాశం ఉందని వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా గతంలో ఎయిమ్స్ నివేదిక సైతం పేర్కొన్నది. అయితే టిష్యూ ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పు వస్తుందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అంటున్నారు. అదెలాగో చూద్దాం.
కణ విభజన అదుపు తప్పి.. ఒక చిన్న ప్రమాదకర కణంగా మొదలై శరీరంలోని ప్రతీ కాణానికి వ్యాపిస్తూ క్యాన్సర్ కణితిగా మారుతుంది. ఇది వివిధ అవయవాలకు కూడా సోకుతుంది. కారణాలేమైనా క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా అంత ఈజీ కాదు, చాలా ఖర్చు, రిస్క్‌తో కూడి ఉంటుంది. అందుకే దీనిని పూర్తిగా అరికట్టేందుకు నిరంతర పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఒక విప్లవాత్మకమైన డెవలప్‌మెంట్ తీసుకొచ్చారు. అదే టిష్యూ ఇంజనీరింగ్.
క్యాన్సర్ సోకిన భాగంలో జీవ కణాలను పునరుద్ధరించడానికి, కొత్త కణాల ఉత్పత్తిని మెరుగు పర్చడానికి అవసరం అయ్యే బయో మెడికల్ ప్రాసెస్‌నే టిష్యూ ఇంజనీరింగ్‌గా పేర్కొంటున్నారు పరిశోధకులు. క్యాన్సర్ మహమ్మారితో పోరాటంలో ఇది గొప్ప ముందడుగు అంటున్నారు. క్యాన్సర్ చికిత్సలో బాధను తగ్గించలో ఈ టెక్నాలజీ సహాయపడుతుంది. అంతే కాకుండా క్యాన్సర్ సోకిన శరీర భాగంలో కణాజాల పునరుత్పత్తిని ప్రభావితం చేయడం ద్వారా, వ్యాధికారక కణాల తగ్గుదలకు దోహదం చేస్తుంది. క్యాన్సర్‌తో పాటు డయాబెటిస్, ఆర్థరైటిస్ ట్రీట్మెంట్లలో కూడా టిష్యూ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.