- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెండి ఆభరణాలు, వస్తువులు నల్లగా మారాయా.. ఇలా శుభ్రం చేసుకోండి..
దిశ, ఫీచర్స్ : చాలామంది వ్యక్తులు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వెండి వస్తువులను, ఆభరణాలను బహుమతిగా ఇస్తారు. అలాగే చాలామంది ప్రజలు వారి పూజగది వెండి తాంబాలం, దీపాలు, కుంకుమ భరణి లాంటి పూజా సామాగ్రిని పెట్టుకుంటారు. ఈ వస్తువులు చూసేందుకు ఎంత అందంగా ఉంటాయో పాతబడితే మాత్రం వాటి రంగు నల్లగా మారుతుంది. అలాంటి వాటిని పండుగలు, పెళ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో అవసరమైనప్పుడు వాటిని శుభ్రం చేయడం కష్టంగా మారుతుంది. అయితే కొన్ని సాధారణ గృహోపకరణాలతో వెండి వస్తువులను సులభంగా మెరిసేలా చేయవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టూత్ పేస్ట్..
వెండి పాత్రలు లేదా ఆభరణాలను మెరిపించడానికి తెల్లటి టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఆభరణాలు, పాత్రల పై టూత్‌పేస్ట్‌ను రాసి బ్రష్‌తో శుభ్రం చేసి వేడి నీటిలో ముంచి కాసేపు అలాగే ఉంచాలి. బయటకు తీసిన తర్వాత మరోసారి బ్రష్‌తో మిగిలిన మురికిని శుభ్రం చేసి సాధారణ నీటితో కడిగి పొడిగా తుడవాలి.
టొమాటో సాస్..
టొమాటో సాస్‌ను ఇంట్లో పకోడాలతో ఎక్కువగా తింటారు. అయితే ఇది మీ వెండి పాత్రలు, ఆభరణాలను కూడా మెరిసేలా చేస్తుంది. వెండి వస్తువుల పై టొమాటో సాస్‌ను అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత మెత్తని బ్రష్‌తో శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కడిగి, గుడ్డతో పొడిగా తుడవండి. ఇలా చేయడం ద్వారా వెండి వస్తువులు మెరుస్తాయి.
వెనిగర్..
వెండి ఆభరణాలు లేదా పాత్రలను శుభ్రం చేయడానికి వెనిగర్ ని కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో వెనిగర్ తీసుకుని, దానికి ఉప్పు వేసి, ఈ మిశ్రమంలో పాత్రలు లేదా ఆభరణాలను ముంచండి. సుమారు 20 నుంచి 25 నిమిషాల తర్వాత, ఆ వెండి వస్తువులను వేడి నీటితో శుభ్రం చేయండి.
నిమ్మ, ఉప్పుతో శుభ్రం..
వెండి పాత్రలు, ఆభరణాల నలుపు పోవాలంటే నిమ్మకాయ ముక్కలో ఉప్పు రాసి రుద్ది శుభ్రం చేసుకోవచ్చు. అంతే కాదు వేడి నీటిని తీసుకుని అందులో ఒకటి లేదా రెండు నిమ్మకాయల రసాన్ని కలపండి. ఆ తర్వాత రెండు చెంచాల ఉప్పు వేసి, వెండి వస్తువులను ఈ నీటిలో ముంచి, కాసేపు అలాగే ఉంచండి. దాన్ని బయటకు తీసి శుభ్రం చేసి గుడ్డతో ఆరబెట్టాలి.