డయాబెటిక్ పేషెంట్స్ రంజాన్ ఉపవాసం ఉండొచ్చా?

by sudharani |   ( Updated:2023-03-29 10:12:31.0  )
డయాబెటిక్ పేషెంట్స్ రంజాన్ ఉపవాసం ఉండొచ్చా?
X

దిశ, ఫీచర్స్: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠినమైన ఉపవాసం పాటిస్తారు. ఈ నెలలో ముస్లిం ప్రజలు ఉదయం సెహ్రీ సమయంలో ఆహారం తీసుకున్న తర్వాత రోజంతా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా సాయంత్రం ఉపవాసం విరమిస్తారు. అయితే హెల్దీగా ఉండేవారికి ఈ ఉపవాసాలు పాటించడం వలన ఎలాంటి సమస్య లేదు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించలేని వారికి ఈ ఉపవాసం హానికరం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో డయాబెటిక్ పేషెంట్స్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు తప్పక పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు.

*మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపవాసాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యులను సందర్శించి సరైన సలహాలు తీసుకోవాలి.

*డయాబెటిస్ పేషెంట్స్ రంజాన్ ఉపవాసం ఉండటం నిజానికి మంచిదే. రోజులో కేవలం ఒక పూట మాత్రమే భోజనం తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. కానీ ఈ ఉపవాసం నెల రోజులు కొనసాగించాలి కాబట్టి ఏం తింటున్నారు అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది.

* భోజనంలో అన్నం, రోటీ తీసుకోవడం మూలంగా గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతుంది. అందుకే ఇవి తినడం మంచిది. కానీ మైదా, వైట్ షుగర్, బ్రెడ్ మొదలైన వాటిని దూరం పెట్టాలి.

* ఇక ఖర్జూరతో ఉపవాసం విరమించడం సంప్రదాయం. ఇది శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అందుకే రంజాన్ ఉపవాస దీక్ష సమయంలో ఈ పండుని ఆహారంగా తీసుకుంటారు. ఖర్జూరలో బి-కాంప్లెక్స్‌తో పాటు ‘కె’విటమిన్ కూడా ఉంటుంది. సాయంత్రం ఉపవాసం విరమించేటప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

* మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉపవాసం తర్వాత భోజనంలో ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండేలా చూసుకోండి. వాటిని కర్రీ రూపంలో లేదా పచ్చళ్లుగా చేసుకుని తీసుకోవడం మంచిది.

* అలాగే ఉపవాస వేళల్లో డెయాబెటిస్ పేషెంట్స్ తరచుగా బ్లడ్, షుగర్‌ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి.

* భోజనం, నిద్ర మధ్య గ్యాప్ ఇవ్వాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకండి. రెండు గంటలు వేచి ఉండండి. కాస్త అటు ఇటు తిరిగిన తర్వాత పడుకోవడం మంచిది.

* పూరీ, సమోసా, చెవ్రా, పకోరస్ వంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌ అంత మంచిది కాదు.. కనుక ఉపవాసం సమయంలో వాటిని నివారించండి.

* కెఫిన్ కలిగిన పానీయాలు టీ, కాఫీ, సోడా వంటివి నివారించండి.

*ఇఫ్తార్ తర్వాత మరియు భోజనాల మధ్య షుగర్ డెజర్ట్‌లను నివారించండి. ఫ్రూట్ పీస్ వంటి తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన డెజర్ట్‌లు అనుమతించబడతాయి లేదా శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి చక్కెర రహిత, కెఫిన్ లేని పానీయాలను కూడా తీసుకోవచ్చు.

*ప్రధాన భోజనం సమయంలో లేదా మధ్య తగినంత నీరు, పానీయాలు త్రాగడం ద్వారా మీరు తగినంత హైడ్రేషన్ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. అయితే చక్కెర పానీయాలు, సిరప్‌లు, క్యాన్డ్ జ్యూస్‌లు, చక్కెర జోడించిన తాజా రసాలను నివారించండి.

ఇవి కూడా చదవండి: సమోసాలో బిర్యానీ.. ఆహార ప్రియుల రియాక్షన్ ఇదే

Advertisement

Next Story

Most Viewed