- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రి సేకరించిన తల్లి పాలు పగలు తాగిస్తే.. శిశువు నిద్రకు అంతరాయం.. ఎందుకు?
దిశ, ఫీచర్స్: నవజాత శిశువులు సర్కాడియన్ రిథమ్స్ లేకుండానే జన్మిస్తారు. అందుకే పగలు, రాత్రి తేడా తెలుసుకునేందుకు కాంతి స్థాయిలు, నిత్యకృత్యాలపై ఆధారపడే పిల్లలు..ఇందుకోసం తల్లి పాలపై కూడా డిపెండ్ అవుతారని గత పరిశోధనలు వెల్లడించాయి. నిజానికి తల్లి పాలలో సర్కాడియన్ రిథమ్స్‌కు అనుగుణంగానే మెలటోనిన్ అనే హార్మోన్ స్రవించబడుతుంది. మగతకు కారణమయ్యే ఈ హార్మోన్ పగటిపూట పాలలో తక్కువగా ఉంటుంది, రాత్రిపూట పాలలో ఎక్కువ స్థాయిల్లో ఉండి శిశువుకు విశ్రాంతినిచ్చేందుకు, నిద్రపోవడానికి సహాయపడతాయి. అందుకే పగలు పాలు తాగిన పిల్లలు కాసేపు మాత్రమే పడుకుంటే..రాత్రి పాలు తాగిన పిల్లలు హాయిగా నిద్రపోతారు.
ఈ క్రమంలోనే తల్లి నుంచి సేకరించిన పాలను స్టోర్ చేసి నైట్ టైమ్‌లో శిశువులకు తాగిస్తే వారు నిద్రపోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఆ మిల్క్‌లోని హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అందుకే ఆ సమయాన్ని పగలుగా భావిస్తారు పిల్లలు. దీంతో వారి నిద్ర విధానాలకు అంతరాయం కలుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. తల్లి పాలను తాగే శిశువులు పాలను పంప్ చేసిన సమయానికి కాకుండా వేరే సమయంలో తీసుకుంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందని నిర్ధారించారు శాస్త్రవేత్తలు. నిద్ర-మేల్కొనే చక్రాలను ప్రభావితం చేసే హార్మోన్ల మోతాదును వారు తప్పుగా స్వీకరించడమే ఇందుకు కారణమని తెలిపారు.
తెల్లవారుజామున రెండు నుంచి నాలుగు గంటల సమయంలో తల్లి పాలలో మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధ్యాహ్నం సమయంలో సేకరించిన తల్లి పాలతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ. మొత్తానికి చీకటి పడ్డాక పంప్ చేయబడిన రొమ్ము పాలలో ఎక్కువ మెలటోనిన్ ఉంటుంది(మగత హార్మోన్). ఇందులోని అధిక స్థాయి న్యూక్లియోటైడ్లు నిద్రను ప్రోత్సహిస్తాయి. దీనికి విరుద్ధంగా, ఉదయం పంప్ చేయబడిన రొమ్ము పాలలో కార్టిసాల్ అధిక సాంద్రత ఉంటుంది. ఇది పిల్లలను మరింత అప్రమత్తం చేసే ఒత్తిడి హార్మోన్.
ఇవి కూడా చదవండి:
నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న వారు..ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి !