- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాడిద పురుషాంగాల స్మగ్లింగ్.. వెలుగులోకి భయంకర నిజాలు
దిశ, ఫీచర్స్ : నైజీరియాలో గాడిదల జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. ఇందుకు కారణం చట్టవిరుద్ధంగా గాడిద చర్మాలను మెడిసిన్ తయారీ కోసం చైనాకు రవాణా చేయడమే. తాజాగా హాకాంగ్ - నైజీరియా స్మగ్లింగ్ ఆపరేషన్‌లో గాడిద పురుషాంగాలు పట్టుబడటం సంచలనాన్ని సృష్టించింది. లాగోస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గత వారం మొత్తం 16 జననాంగాల బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకోగా.. దీనిపై విచారణ సాగుతోంది. ఈ క్రమంలో దేశంలో గాడిద జనాభా అంతరించిపోయే పరిస్థితి తలెత్తనుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
బ్రిటీష్ స్వచ్ఛంద సంస్థ ది డాంకీ శాంక్చురీ అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 4.8 మిలియన్ గాడిదలు తమ చర్మాల కోసం అక్రమ రవాణా చేయబడి చంపబడుతున్నాయి. సాంప్రదాయ చైనీస్ రెమెడీ అయిన ఎజియావోను ఉత్పత్తి చేయడానికి వీటిని ఉపయోగిస్తుండగా.. ఇక్కడ ప్రధాన లబ్దిదారులుగా చైనా వ్యాపారులుండటం విశేషం. తద్వారా నైజీరియాలో జంతు విలుప్తతను ఎదుర్కొంటుందనే హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. సంతానోత్పత్తి రేటు కూడా దారుణంగా పడిపోయిందని తెలుస్తోంది. కాగా ఈ యానిమల్ ట్రాఫికింగ్ అరికట్టేందుకు సెనేటర్లు 2021లో ప్రతిపాదనలు తీసుకొచ్చినా.. ఇంకా చట్టపరమైన ఆమోదం పొందాల్సి ఉంది. ఇక పొరుగున ఉన్న నైజర్ నుంచి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న విలువైన గాడిద చర్మాలను స్వాధీనం చేసుకుంది నైజీరియా కస్టమ్స్.