వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మెషిన్.. ట్రావెలింగ్‌లో ఉపయుక్తం

by sudharani |
వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మెషిన్.. ట్రావెలింగ్‌లో ఉపయుక్తం
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా కొత్త ప్రదేశానికి లేదా తీర్థయాత్రలకు వెళ్లినపుడు బట్టలు ఉతికేందుకు సరైన ప్లేస్ దొరక్క ఇబ్బందిపడటం కామన్. ఎప్పుడోఓసారి ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్య ఎదుర్కొన్నవారే కాగా.. తాజాగా ఓ జపనీస్ కంపెనీ జిప్పర్ బ్యాగ్‌తో దీనికి సులభ పరిష్కారాన్ని అందించింది. ఇంతకీ ఆ జిప్పర్ బ్యాగ్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

జపనీస్ కంపెనీ కావో 'ఎటాక్- జీరో లాండ్రీ బ్యాగ్' పేరుతో 5-లీటర్ల జిప్పర్ బ్యాగ్‌ను రూపొందించింది. ఎవరైనా సరే ఎప్పుడైనా, ఎక్కడైనా దుస్తులను సులభంగా, సులువుగా ఉతకడంలో ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా ప్రయాణ సమయంలో లేదా సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లినపుడు ఉపయుక్తకరంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక దీని వినియోగం విషయానికొస్తే.. జిప్పర్ లాక్‌ను ఓపెన్ చేసి డిటర్జెంట్‌, మురికిగాఉన్న దుస్తుల్ని లోపల పెట్టి నీటితో నింపాలి. ఆ తర్వాత జిప్పర్‌ను మూసేసి లాండ్రీని కాసేపు నానబెట్టాలి. ఆపై ఎటాక్ జీరో బ్యాగ్‌ను షేక్ చేసిన తర్వాత లాండ్రీని చేత్తో ఉతుకుతున్నట్లుగా బ్యాగ్‌ను సున్నితంగా రుద్దాలి. చివరగా బ్యాగ్ వైపు ఉన్న చిన్న వాల్వ్‌ను విప్పేస్తే, మురికి మిశ్రమం బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు లాండ్రీని మరోసారి శుభ్రం చేసేందుకు నీళ్లు నింపి, అవసరమైనన్ని సార్లు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది.

వాస్తవానికి క్యాంపింగ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి స్మార్ట్ వాషింగ్ మెషిన్ పెద్దగా మేలు చేయదు. కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, విద్యుత్ అందుబాటులో లేనప్పుడు మాత్రం ఈ జిప్పర్ బ్యాగ్ ఎంగానో ఉపయోగపడుతుంది.

Advertisement

Next Story