ఉగాది పండుగ వచ్చేసింది.. తిథి, ముహుర్తానికి సంబంధించిన పూర్తి వివరాలివే..

by samatah |   ( Updated:2023-03-20 08:40:16.0  )
ఉగాది పండుగ వచ్చేసింది.. తిథి, ముహుర్తానికి సంబంధించిన పూర్తి వివరాలివే..
X

దిశ, వెబ్‌డెస్క్ : హిందువులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఉగాది. తెలుగువారి పండుగలన్నీ ఉగాదితోనే ప్రారంభం అవుతాయంటారు. ముఖ్యంగా ఏపీ, కర్ణాట, తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఈపండుగను జరుపుకుంటారు. కానీ ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు. అయితే ఈ సారి ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది. ఏ రోజున జరుపుకోవాలి,తిధి, ముహుర్తం గురించిన వివరాలను తెలుసుకుందాం.

వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఉగాది లేదా యుగ ప్రారంభం సంస్కృతి పదాల నుండి ఉద్భవించింది. వసంత ఋతువు ప్రారంభాన్ని ఉగాది సూచిస్తుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పారు. ఈరోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని బలంగా విశ్వసిస్తారు. ప్రభవ నామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆరుగురు బ్రాహ్మలు బ్రహ్మ కల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం ఏడో బ్రహ్మ బ్రహ్మ కల్పం కొనసాగిస్తున్నారు. శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అంటుటారు.

ఇక ఉగాది పండుగ రోజు నూనెతో తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, ఆలయాలను దర్శించి, షడ్రుచుల పచ్చడిని రుచి చూసి, పంచాంగ శ్రవణం వింటారు.


ఇక ఈ సారి ఉగాది పండుగ మార్చి 22,2023 బుధవారం రోజున వచ్చింది. ఈ రోజున పండుగను తెలుగు ప్రజలందరూ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు.

ఉగాది తిథఇ, ముహుర్తం

చైత్ర శుక్ల ప్రతిపద తిథి మార్చి 21, 2023 రాత్రి 10:52 గంటలకు ప్రారంభం అవుతుంది.

చైత్ర శుక్ల ప్రతిపద తిథి మార్చి 22, 2023 రాత్రి 08:20 గంటలకు ముగుస్తుంది.

Also Read..

ఉగాది రోజు తలంటు స్నానం ఎందుకు చేయాలో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed