- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందరూ దాన్ని ఆకు అనే అనుకున్నారు.. కానీ తీరా చూస్తే..!
దిశ, వెబ్ డెస్క్: చెట్టు కింద పడి ఉన్న దాన్ని చూసిన వారంతా అది ఆ చెట్టుకు సంబంధించిన ఆకు అనే అనుకున్నారు. చెట్టు ఆకు కింద పడి ఎండిపోయింది అనుకున్నారు. దగ్గరికెళ్లి దాన్ని టచ్ చేసి చూస్తే గానీ వారికి అర్థంకాలేదు అది ఆకు కాదు బటర్ ఫ్లై (సీతాకోక చిలుక) అని. అదేంటి ఆకు బటర్ ఫ్లై ఎలా అయింది అనే కదా మీ డౌట్. అయితే ఈ సందేహం తీరాలంటే డెడ్ లీఫ్ బటర్ ఫ్లై గురించి తెలుసుకోవాల్సిందే. ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. అందులో రంగు రంగుల రెక్కలతో మనల్ని ఎంతగానో ఆకట్టుకునే సీతాకోక చిలుక జాతి ఒక్కటి. అయితే అన్ని సీతాకోక చిలుకల రెక్కలు కలర్ ఫుల్ గా ఉండవు.
కల్లిమా ఇనాచస్ సీతాకోకచిలుక రెక్కలు మూసుకున్నప్పుడు అచ్చం ఎండిపోయిన ఆకుల్లా ఉంటాయి. అందుకే ఈ రకమైన సీతాకోక చిలుకను 'డెడ్ లీఫ్ బటర్ ఫ్లై' అంటారు. ఇంతకూ ఈ బటర్ ఫ్లై రెక్కలు ఎండిన ఆకుల్లా ఉండటానికి ఓ ముఖ్య కారణముంది. శత్రువుల నుంచి కాపాడుకోవడానికి డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈ బటర్ ఫ్లై ఇలాంటి లక్షణాన్ని అభివృద్ధి చేసుకుందని నేషనల్ జియోగ్రాఫిక్ చెబుతోంది. శత్రువులను గమనించిన వెంటనే ఈ సీతాకోకచిలుక వెంటనే తన రెక్కలను ముడుచుకొని ఎండిన ఆకులా మారుతుంది. శత్రువు నుంచి రక్షించుకొనే ఈ వ్యూహాన్ని క్రిప్సిస్ అంటారు. ఇక మామూలు సందర్భాల్లో కల్లిమా ఇనాచస్ సీతాకోక చిలుక తన రెక్కలను విచ్చుకొని కలర్ ఫుల్ గా కనిపిస్తుంటుంది. తాజాగా కల్లిమా ఇనాచస్ సీతాకోక చిలుకకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షేరు చేసిన 24 గంటల్లోనే కల్లిమా ఇనాచస్ సీతాకోక చిలుక వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. 20 వేలకు పైగా నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేశారు.
Read more:
గ్లాస్ ఫ్రాగ్స్.. ట్రాన్స్‌పరెంట్‌గా ఎలా మారుతున్నాయో తెలుసా?