దాహంతో ఉన్న ఏఐ.. ఒక్కో కన్వర్జేషన్‌కు 500మి.లీ. నీటిని తాగేస్తుంది..

by Hamsa |   ( Updated:2023-07-26 14:35:36.0  )
దాహంతో ఉన్న ఏఐ.. ఒక్కో కన్వర్జేషన్‌కు 500మి.లీ. నీటిని తాగేస్తుంది..
X

దిశ, ఫీచర్స్: OpenAI క్రియేట్ చేసిన ChatGPT గత కొద్ది నెలలుగా ట్రెండింగ్‌లో ఉంది. ప్రతిరోజు బిలియన్ల మంది ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తుండగా.. దీని వల్ల కలిగే అడ్వాంటేజెస్ సంగతి ఎలా ఉన్నా ఫ్యూచర్‌లో జరగబోయే నష్టాల గురించి కొంతమందిలో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న చాట్‌జీపీటీ.. ఒక్కో కన్వర్జేషన్‌కు 500 మి.లీ. నీటిని వినియోగిస్తున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో రివర్‌సైడ్ మరియు యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్టన్ పరిశోధనలో ఈ ఫలితాలు వెలువడ్డాయి.

టెక్సాస్ మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన అత్యాధునిక US డేటా సెంటర్‌లో ట్రైనింగ్ GPT 3 దాదాపు 7,00,000 లీటర్ల నీటిని వినియోగిస్తుందని తెలిపిన అధ్యయనం.. ఆసియాలోని డేటా సెంటర్‌లలో ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. OpenAIతో సహా దాదాపు అన్ని పెద్ద టెక్ సంస్థలు ప్రస్తుతం Google బార్డ్, మెటాస్ లామా AI మోడ్‌లపై పని చేస్తున్నాయి. ఈ AI మోడల్‌లకు శిక్షణ ఇచ్చే ప్రక్రియ దాదాపు ఒకే విధంగా ఉన్నందున ఈ AI ప్లాట్‌ఫారమ్‌లకు కూడా లాజిక్ అదే విధంగా ఉంటుంది.

ChatGPT వంటి AI మోడల్ వాటర్‌ ఫుట్‌ప్రింట్ ప్రాథమికంగా మోడల్‌ను హోస్ట్ చేసే, అమలు చేసే సర్వర్‌లు, డేటా సెంటర్‌లకు శక్తిని అందించడానికి అవసరమైన శక్తి వినియోగంతో ముడిపడి ఉంటుంది. ఈ డేటా సెంటర్స్‌కు కూలింగ్ సిస్టమ్స్, ఎనర్జీ ఇంటెన్సివ్ కంప్యూటింగ్ రీసోర్సెస్ అవసరం. ఇవి కూలింగ్ వాటర్, విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటి వినియోగానికి దోహదం చేస్తాయి. AI మోడల్స్ వాటర్ ఫుట్‌ప్రింట్.. సెంటర్స్ ఉపయోగించే శక్తి మిశ్రమం, శీతలీకరణ పద్ధతులతోపాటు హార్డ్‌వేర్ ఎఫిషియన్సీపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Next Story