- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందే కాబోయే వధూవరులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లంటే మూడుముళ్లు, ఏడు అడుగులతో ఇద్దరు వ్యక్తులు ఏకమయ్యే పవిత్రమైన బంధం. పెళ్లిబంధంతో ఈ బంధంతో ఏకమైన జంట సుఖశాంతులతో ఉండాలని, వారి జీవితం సాఫీగా సాగాలని నూతన దంపతులు, వారి తల్లిదండ్రులు, వివాహానికి హాజరైన బంధువులు కోరుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్లి అయిన జంటలు కొంత కాలం వరకే కలిసి ఉండి తరువాత విడాకుల వరకు వెలుతున్నారు. అటు పెద్దలు కుదిర్చిన వివాహం అయినా, ఇటు లవ్ మ్యారేజ్ అయినా ఇలాగే జరుగుతుంది.
అలా కాకుండా కొత్త జీవితంలో అడుగుపెట్టిన దంపతుల జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఆ ఇద్దరి మధ్యలో అరమరికలు ఏమీ ఉండకూడదు. ఒకరి అభిప్రాయాలను, అభిరుచులను మరొకరు గౌరవించుకోవాలి. తన భాగస్వామి ఇష్టాలను తెలుసుకుని వారి ఇష్టంగా మార్చుకో గలిగే స్వభావం ఉండాలి. ఖాళీ సమయాల్లో చేసేపనుల గురించి మాట్లాడుకోవాలి. అంతే కాదు వివాహానికి ముందే తన భాగస్వామితో అన్ని విషయాలను గురించి స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఇద్దిర మధ్య కమ్యూనికేషన్ బలపడేటట్టు చూసుకోవాలి.
అలా ఉన్నప్పుడే ఎంత పెద్దగొడవలు జరిగినా వెంటనే సర్దుకుంటాయి. పెళ్లికి ముందు బ్రేకప్స్ ఉంటే ముందే చెప్పుకోవాలి. ఆర్థిక స్థితిగతులతో పాటు డబ్బు ఖర్చు గురించిన విషయాలను తెలుసుకోవాలి. బాధ్యతలు పంచుకోవాలి. భవిష్యత్తు గురించిన ఆలోచనలను పంచుకోవాలి. తమ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, భవిష్యత్తులో ఎలా ఎదగాలో అన్ని విషయాలను మాట్లాడుకోవాలి. ఇలా చేశారంటే ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు జరగకుండా జీవితాంతం పెళ్లి బంధం పటిష్టంగా ఉంటుంది.
Also Read: సెక్స్‌తో ఆరోగ్య సమస్యలకు చెక్.. వారానికి ఎన్నిసార్లు చేయాలి..?