- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంవత్సరం లోపు పిల్లల ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దిశ, ఫీచర్స్ : అమ్మతనం గొప్ప వరం. తన కడుపులో నలుసు పడిన రోజు నుంచి తన బిడ్డపై ఆ తల్లి చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తల్లి మంచి ఆహారం తీసుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా బిడ్డ భూమిపైకి వచ్చిన తర్వాత కూడా తన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.
అయితే అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుంచి సంవత్సరం పిల్లల వరకు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా ఐసీఎమ్‌ఆర్ శిశువుల ఆహారానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుల చేసింది. అందులో పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి. ఎలాంటి ఆహారం పెట్టకూడదు అనే విషయాలను తెలిపింది.
ఐసీఎమ్‌ఆర్ మార్గదర్శకాల ప్రకారం.. శిశువులకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తప్పకుండా తల్లి పాలు తప్ప మరి ఏ ఇతర ఆహార పదార్థాలు పెట్టకూడదంట. అలాగే శిశువుకు 10 నుంచి 11 నెలలు దాటిన తర్వాతే బయట పాలు పెట్టాలంట. అంతే కాకుండా శిశువుకు ఇచ్చే ఆహారంలో ఉప్పు, పంచదార, మసాలా వంటివి అస్సలే చేర్చకూడదు అంటున్నారు నిపుణులు. సంవత్సరం లోపు పిల్లలకు నెయ్యిని ఆహారంలో చేర్చి ఇవ్వడం అలాగే, కూరగాయలు, క్యారెట్, బీట్ రూట్, చేపల వంటి ఆహారాన్ని చేర్చవచ్చునంట. ఇది వారి ఎదుగుదలకు ఎంతోగానో ఉపయోగపడుతుందంట. ( నోట్ : పై వార్తను దిశ ధృవీకరించడం లేదు. ఇంటర్ నెట్‌లో లభించిన సమాచారం ఆధారం, వివిధ నిపుణులు, వైద్యులు పేర్కొన్న సూచనల మేరకు మాత్రమే ఇవ్వబడింది. )