మీ చీరకు చిల్లులున్నాయా.. ఇదేనండి తాజా ట్రెండ్!

by Jakkula Samataha |
మీ చీరకు చిల్లులున్నాయా.. ఇదేనండి తాజా ట్రెండ్!
X

దిశ, ఫీచర్స్ : మగువలు ఎంతగానో ఇష్టపడేదాంట్లో చీరలు ఒక్కటి. మార్కెట్‌లోకి ఏ కొత్తరకం చీర వచ్చిందా.. ఎలాంటి కలర్స్‌లో ఏ రకం సారీస్ ఉన్నాయో అని ఆన్‌లైన్‌లో తెగ మహిళలు వెతుకుతారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు, ఏ చిన్న శుభకార్యం జరిగినా, బర్త్ డే పార్టీస్‌కు కూడా చీరకట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.కాస్త ట్రెండీగా, చూడనికీ ఫ్యాషన్‌గా ఉన్న చీరలను కొనుగోలుచేస్తున్నారు. అంతే కాదండోయ్..మూవీస్‌లో హీరోయిన్స్ ఏ డిజైన్ సారీస్ కట్టుకున్నారు, ప్రీరిలీజ్ ఈవెంట్‌‌కి ఎలాంటి సారీస్‌తో వస్తున్నారో చూసి అలాంటి డిజైన్స్ కోసం ఆన్ లైన్ షాపింగ్ యాప్స్‌లో తెగ వెతుగుతున్నారంట.

అయితే అబ్బాయిలకు చిల్లులు పడిన ప్యాంట్స్ ఎలా ట్రెండ్‌నో, ఇప్పుడు అమ్మాయిలకు కూడా చిల్లులు పడిన సారీనే ట్రెండ్ అయిపోయిందంట. ఈ మధ్య అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఓ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాటిల్ గ్రీన్ కలర్‌లో ఉన్న కట్వర్క్ సారీలో మెరిసింది. ఇక చిల్లులు చిల్లులుగా ఉన్న ఆ సారీలో ఆ అందాల సుందరి గ్లామర్ గురిచి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. దీంతో అమ్మాయిలు ఆ సారీ కోసం వెతకడం ప్రారంభించారంట. దాని ధర ఎంత? ఎక్కడ దొరుకుతుందని నెట్టింట్లో తెగి వెతుకున్నతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఆ డిజైనర్ వేర్ సారీ ధర 1.59లక్షల రూపాయలంట.

Advertisement

Next Story