- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్నెట్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రదేశాలు ఇవే.. వాటి ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
దిశ, ఫీచర్స్: భారతదేశంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్‌గా ట్రావెల్ వెబ్‌సైట్ booking.com విదేశీ పర్యాటకులు అత్యధికంగా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన భారతీయ పర్యాటక ప్రదేశాలను వెల్లడిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో భారతదేశంలో ఏయే పర్యాటక ప్రదేశాలు విదేశీయులకు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయో తెలిపింది. మరి ఓ సారి ఆ లిస్ట్ చూసేద్దామా..
1) ఢిల్లీ: ఇది భారతదేశానికి రాజధాని మాత్రమే కాదు. ఇది చరిత్ర, ఆధునికత కలయికతో కూడిన పురాతన నగరం. ఎర్రకోట, కుతుబ్ మినార్, తాజ్ మహల్, కరోల్ బాగ్, సరోజినీ నగర్, లజపత్ నగర్, చాందినీ చౌక్, సౌరీ బజార్, యాన్ మార్కెట్, ప్రశాంత లోధి గార్డెన్స్, అద్భుతమైన స్మారక చిహ్నాలు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి.
2) ముంబై: కలల నగరంగా పేరొందిన ముంబై విదేశీ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన నగరాల్లో రెండో స్థానంలో ఉంది. భారతదేశం ఆర్థిక రాజధానిగా, ఇది బాలీవుడ్, లైఫ్ స్టైల్, ఫ్యాక్టరీ నిర్మాణాలకు కొలువైనది.
3) బెంగళూరు: భారతదేశంలోని సిలికాన్ వ్యాలీగా పిలువబడే బెంగళూరు అందమైన వాతావరణం, ఉద్యానవనాలు, సరస్సులతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. బెంగళూరులో బన్నెరఘట్ట నేషనల్ పార్క్, నంది హిల్స్, లాల్ బాగ్, కబ్బన్ పార్క్, బెంగుళూరు ప్యాలెస్, విధాన సౌధ, స్నో సిటీ, బెంగుళూరు ఫోర్ట్, కమర్షియల్ స్ట్రీట్ వంటి అనేక సందర్శనా స్థలాలు ఉన్నాయి.
4) జైపూర్: భారతదేశంలోని పింక్ సిటీగా పిలువబడే జైపూర్ రాజస్థాన్ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ప్రవేశ ద్వారం. ఇది ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశం. అలాగే దేశ, విదేశాల నుండి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
5) చెన్నై: దేవాలయాలు, బ్రిటీష్ కాలం నాటి మ్యూజియంలు, స్మారక చిహ్నాలు, దక్షిణ భారత సంస్కృతిని గొప్పగా చెప్పుకునే ప్రసిద్ధ మెరీనా బీచ్ చెన్నైకి ప్రధాన ఆకర్షణలు. విదేశీ పర్యాటకులు ఇంటర్నెట్‌లో అత్యధికంగా సెర్ఛ్ చేసిన భారతీయ పర్యాటక ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.
6) హంపి: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన హంపి కర్ణాటకకు గర్వకారణం. ఇది బలమైన చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎక్కువగా విదేశీయులను ఆకర్షిస్తుంది. దీనిని కూడా ఇంటర్నెట్‌లో ఎక్కువ సెర్చ్ చేసినదానిలో ఉంది.
7) హైదరాబాద్: కుల మతాలకు అతీతగా ఉన్న హైదరాబాద్‌లోని కొన్ని ప్రదేశాలను కూడా సెర్చ్ చేసినట్లు నివేదిక చెబుతోంది.