నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.. RRRను ప్రకటించనున్న స్పీకర్

by Rani Yarlagadda |
నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.. RRRను ప్రకటించనున్న స్పీకర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో నేడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా ప్రకటిస్తారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ప్రశ్నోత్తరాల అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం 5 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయ చట్ట సవరణ బిల్లు -2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియో ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు -2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ చట్ట సవరణ బిల్లు -2024ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు -2024, ఏపీ విద్యుత్ సుంకం చట్ట సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ MSME పాలసీ 4.0పై ప్రకటన చేయనున్నారు. మంత్రి టీజీ భరత్.. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీలపై ప్రకటన చేయనున్నారు. 2024-25 బడ్జెట్ పై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed