Karthika masam : కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

by Prasanna |
Karthika masam : కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక మాసంలో ( Karthika masam ) భక్తులు శివుడికి పూజలు చేస్తుంటారు. హిందూ సంప్రదాయంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా, ఉసిరి మీద దీపం వెలిగించేటప్పుడు కొన్నింటిని పాటించాలి. దీని వలన జీవితంలో ఉన్న సమస్యలు దూరమవుతాయి. ఈ మాసంలో చేసిన పూజలు వందరెట్ల ఫలితాలు ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అయితే.. కొందరు కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు. అసలు, ఇలా వెలిగించడం వెనుక ఉన్న రహస్యమేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉసిరిని లక్ష్మీ దేవి స్వరూపంగా చెబుతుంటారు. ఈ చెట్టులో సకల దేవతలు కూడా నివాసం ఉంటారనిపురాణాలు చెబుతున్నాయి. అందుకే, కార్తీకంలో ఉదయాన్నే లేచి దీపం వెలిగించి, ఉసిరి చెట్టు దీపారాధన కూడా చేస్తారు. దీని వల్ల ధనయోగం కల్గుతుందని చెబుతుంటారు.

ఉసిరికి చెట్టుకు ధనాన్ని ఆకర్శించే గుణం ఉంటుంది. అందుకే, కార్తీకంలో ఎక్కువగా ఉసిరి చెట్టును పూజిస్తారు. ఇదిలా ఉండగా.. ఉసిరి మీద దీపం వెలిగించడంతో పాటు, ఉసిరి పండ్లను పండితులకు ఇస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed