- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఇవే
దిశ, వెబ్ డెస్క్: చీకటి రాత్రి.. ఒక్క కరెంటు స్తంభం కూడా లేదు, ఎగుడు దిగుడు రోడ్లు మరుక్షణంలో ఏమి జరుగుతుందో కూడా మీరు ఊహించలేరు. ప్రపంచంలో ఇప్పటికి ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి. మానవులు ఎవరు అక్కడ అడుగు పెట్టలేరు. అక్కడికి వెళ్లకపోవడానికి కారణం ఈ భయంకరమైన రోడ్లు, దారులు. ఇలాంటి రోడ్ల మీదకు ఒక పది మంది కష్టంగా, అందులో సగం మంది మాత్రమే బతుకుతారు. ఇలాంటి దారుల్లో మృత్యువు అడుగడుగునా పొంచే ఉంటుంది. టైం బాగలేకపోయిన, రోడ్లు బాగలేకపోయిన, జరిగే నష్టం మాత్రం మాములుగా ఉండదు. అందుకే పొరపాటున కూడా ఇలాంటి దారుల వెంట వెళ్లడానికి అసలు సాహసం చేయకండి. ఎందుకంటే తప్పు ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే ఆలోచించే అవకాశం కూడా ఉండదు. అత్యంత ప్రమాదకరమైన ఈ రోడ్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం..
జిండో రోడ్
ఈ వంతెన మీద వాహనాల మీద కాకుండా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రహదారి ఏడాదిలో కేవలం రెండు సార్లు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా సమయం అంతా నీటిలో మునిగి ఉంటుంది. ఈ దారిలో నడవాలి అనుకుంటే.. చాలా జాగ్రత్తగా నడవాలి. కొంచెం అటు, ఇటు మారిన సరే సముద్రంలో మునిగిపోవాల్సిందే. ఈ వంతెన జిండో ద్వీపకల్పం, మోడో ద్వీపకల్పాన్ని కలుపుతుంది. దీన్ని ఎవరు నిర్మించలేదు. ప్రకృతి సహజంగా ఏర్పడిన వంతెన ఇది.
లాస్ కారకోల్స్ హైవే
ఏంతో అందంగా ఉండే ఈ రోడ్ అంతే ప్రమాదం కూడా. శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. దానితో రహదారులు మూసుకుపోతాయి. ఎత్తైన ప్రదేశాలు, వంపుల తిరిగిన రోడ్ల మీద ప్రయాణం చాలా భయంగా అనిపిస్తుంది. ఈ రహదారి సముద్రమట్టానికి 32 వేల అడుగులు పైన ఉంటుంది. ఇంతగా వంపులు ఉన్న రోడ్ల మీద బాగా అనుభవం ఉన్న డ్రైవర్ బండి నడపగలడు. మంచు బాగా కురిసే సమయంలో ఈ రోడ్లను పూర్తిగా మూసేస్తారు. వాతావరణం అనుకూలంగా ఉండే సమయంలో మాత్రమే ఈ రోడ్లు తెరిచే ఉంటాయి.
ఇవి కూడా చదవండి: వర్షంలో టూవీలర్ నడుపుతున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే