- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్యాణ ఘడియలు వచ్చేశాయి.. పెళ్లీలకు జూన్, జూలైలో మంచి ముహుర్తాలు ఇవే!
దిశ, ఫీచర్స్ : పెళ్లి అనగానే ఆ ఇంటికే కల వస్తుంది. పచ్చటి తోరణాలు, బంధువులతో ఆ ఇళ్లు, వాడ సందడిగా కనిపిస్తుంది. మా ఇంటి పెళ్లి సందడి, శ్రీరస్తు.. శుభమస్తూ అంటూ వాట్సాప్‌లో స్టేటస్‌లు మోగిపోతాయి. అయితే కళ్యాణం కమనీయం అనే పాటలు వినబడక, భాజాభజంత్రీలు మోగక చాలా రోజులు అవుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు శుభకార్యాలు చేసుకోవడమే కాకుండా, పెళ్లీలు కూడా జరిగాయి. అయితే ఆ తర్వాత మూఢం, శూన్య మాసం రావడం వలన ఈ రోజుల్లో వివాహాది శుభకార్యాలు జరగలేదు. అయితే ఇప్పుడు మళ్లీ కళ్యాణానికి మంచి ఘడియలు మొదలు అయ్యాయి. వచ్చే నెల నుంచి పెళ్లీలకు మంచి ముహుర్తాలు ఉన్నాయంటున్నారు పండితులు.
కాగా, ఏ నెలలో, ఏ తేదీల్లో మంచి ముహుర్తం ఉందో ఇప్పుడు చూద్దాం :
జూన్ 29 శనివారం
జూలై 9 మంగళవారం
జూలై 11 గురువారం
జూలై 12 శుక్రవారం
జూలై 13 శనివారం
జూలై 14 ఆదివారం
జూలై 15 సోమవారం తేదీల్లో మాఘ, ఉత్తర ఫాల్గుణి, హస్తా, స్వాతి నక్షత్రాల వేళ శుభ ముహుర్తాలు ఉన్నాయంట. ఈ సమయంలో పెళ్లీలు చేసుకోవచ్చని, వివాహాది శుభకార్యాలకు ఈరోజులు చాలా మంచివని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా తర్వాత వచ్చే చాతుర్మాసం కారణంగా ఆగస్టు 2024 నుంచి అక్టోబర్ 2024 వరకు తెలుగు ముహూర్తాలు లేవని, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలలోనే వివాహాది శుభకార్యాలకు శుభ ముహుర్తాలు ఉన్నట్లు పురోహితులు తెలుపుతున్నారు.