మహిళల్లో సంతానోత్పత్తి పెంచే బెస్ట్ ఆహారాలు ఇవే..?

by Anjali |   ( Updated:2023-08-16 14:33:12.0  )
మహిళల్లో సంతానోత్పత్తి పెంచే బెస్ట్ ఆహారాలు ఇవే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఆహారం అనేది ముఖ్యమైన అంశం. కానీ ఈ ఉరుకుల పరుకుల జీవితంలో చాలా మంది సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మనం తినే ఆహారం కేవలం మనిషి ఆరోగ్యంపైనే కాకుండా గర్భం దాల్చే మహిళలపై కూడా ప్రభావితం చేస్తాయని తాజాగా పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. సంతానోత్పత్తిని పెంచుకోవాలనుకునే వారు ఆహారంలో కొన్ని రకాల పౌష్టికాహారాలను జోడిస్తే ప్రయోజనాలు ఉంటాయని ప్రముఖ న్యూట్రిషియన్ లోవ్‌నీత్ బాత్రా పేర్కొంటున్నారు.

“మీరు తల్లి కావాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రోటీన్స్‌తో కూడిన ఆహారాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. మీ సంతానోత్పత్తిని ఆప్టిమైజ్ చేయడంలో ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది. పోషకాహార శక్తితో సంతానోత్పత్తి ప్రయాణాన్ని స్వీకరించండి. ఈ పోషకాలతో నిండిన ఆహారాలు నిండు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇందుకోసం మీరు తాజా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లతో కూడిన మంచి ఆహారం, పిండి పదార్థాలు, పాలు, వాల్ నట్స్, బాదం, దానిమ్మ, ఆవుపాలు, అత్తిపండు, బీన్స్, కాయధాన్యాలు వంటివి తినాలని లోవ్‌నీత్ బాత్రా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed