డ్యాన్స్ చేయడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. ఎగిరి గంతు వేస్తారు!

by Jakkula Samataha |
డ్యాన్స్ చేయడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. ఎగిరి గంతు వేస్తారు!
X

దిశ, ఫీచర్స్ : డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఏక్కడైనా మ్యూజిక్ వినిపిస్తే చాలా కొందరు తమకు తెలియకుండా స్టెప్స్ వేస్తుంటారు. కానీ కొందరు మాత్రం డ్యాన్స్‌కు చాలా దూరంగా ఉంటారు. వారికి డ్యాన్స్ చేయడమే కాదు, చూడటం కూడా ఇష్టం ఉండదు. కానీ డ్యాన్స్ చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరానికి శారీరక శ్రమ అనేది చాలా అవసరం. ఇది లేకపోతే అధిక బరువు సమస్య భారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా మారుతున్న జీవన శైలీ, తీసుకుంటున్న ఆహారం వలన చాలా మంది అధికంగా బరువు పెరిగిపోతున్నారు. అంతే కాకుండా కుర్చిలో కూర్చొని పని చేయడమే తప్ప, శారీరకంగా ఎక్కువగా వర్క్ చేయడం లేదు. అయితే ఇలాంటి సందర్భంలో డ్యాన్స్ చేయడం చాలా మంచిదని నిపుణుల అభిప్రాయం. తాజాగా విడుదల చేసిన ఓ నివేధికలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ప్రతి రోజూ 30 నిమిషాలు డ్యాన్స్ చేయడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని, అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు అని తేలింది. దీని వలన శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా ధృఢంగా ఉంటారంట. అంతే కాకుండా క్రమం తప్పకుండా రోజూ ఉదయం డ్యాన్స్ చేయడం వలన శరీర బలం పెరగడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. దీని వలన అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తకపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చునంట. అయితే డ్యాన్స్ చేసే విధానంపై కూడా ఇది ఆధారపడి ఉంటుందని వారు తెలుపుతున్నారు. ఫాస్‌గా చేయడం, స్లోగా చేయడం.. రెండూ మిక్స్ చేస్తూ డ్యాన్స్ చేయడం. కాబట్టి మీరు చేసే విధానం బట్టి మార్పు ఉంటుందంట.

Advertisement

Next Story

Most Viewed