- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్సువల్ హెల్త్ : లైంగిక ఆరోగ్యంపై అనేక రకాల అపార్థాలు
దిశ, ఫీచర్స్ : లైంగిక ఆరోగ్యం అనేక రకాల అపోహలు, అపార్థాలతో ముడిపడి ఉంటుంది. అలానే సెక్సువల్ పార్ట్‌నర్స్ తమ లైంగిక సమస్యలు, సందేహాలను డాక్టర్ల వద్ద ప్రస్తావించేందుకు సిగ్గుపడుతూ ఇంటర్నెట్‌పై ఆధారపడుతుంటారు. అక్కడ లభించే తప్పుడు సమాచారాన్ని అనుసరించడం వల్ల సమస్య మరింత జఠిలమై, లైంగిక సంక్రమణ వ్యాధులు తీవ్రతరమవుతాయి. ఈ నేపథ్యంలోనే WHO అంచనా ప్రకారం ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ STIలు పుట్టుకొస్తున్నాయి. ఈ మేరకు జనాల్లో చెలామణిలో ఉన్న కొన్ని లైంగిక అపోహలు, సందేహాలను ఇంగ్లండ్‌కు చెందిన సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ నిపుణులు డాక్టర్ స్యూ మాన్ నివృత్తి చేశారు.
* 'పిల్' తీసుకుంటే STI సంక్రమించదు
ఇది ఒక అపోహ. నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకం STI బారిన పడకుండా రక్షించదు. ఇది గర్భాన్ని నిరోధించడానికి మాత్రమే పనిచేస్తుంది. గర్భనిరోధక మాత్రను ఉపయోగించినప్పుడు కూడా STI బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఏకైక మార్గం కండోమ్ ధరించడమే. అంతేకాదు 'పిల్, ప్యాచ్, రింగ్, ఇంట్రాటెరైన్ డివైజ్(IUD)' వంటి జనన నియంత్రణ పద్ధతులు గర్భధారణను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కానీ STIలు, HIV నుంచి రక్షించలేవు.
* Withdrawal method గర్భాన్ని నిరోధిస్తుంది
పుల్-అవుట్ మెథడ్‌గా పిలువబడే ఉపసంహరణ పద్ధతి(Withdrawal method) అంటే స్కలనానికి ముందు పురుషాంగాన్ని యోని నుంచి బయటకు తీయడం. ఇది ప్రెగ్నెన్సీ అవకాశాన్ని తగ్గించినప్పటికీ పూర్తిగా గర్భధారణ నిరోధించేందుకు నమ్మదగిన మార్గం కాదు. పర్‌ఫెక్ట్‌గా ఉపయోగించినప్పుడు ప్రెగ్నెన్సీ ప్రమాదాన్ని తగ్గించినా.. సెక్స్ పీక్ స్టేజ్‌లో ఉన్నపుడు ఖచ్చితత్వాన్ని పాటించలేం. పైగా పురుషాంగం స్కలనానికి ముందు ప్రీ-కమ్‌ను విడుదల చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ద్రవంలోనూ స్పెర్మ్ ఉండవచ్చు. అంతేకాదు ఈ ఉపసంహరణ పద్ధతిని ఉపయోగించిపప్పటికీ HIV, హెర్పెస్, సిఫిలిస్, గనేరియా లేదా క్లామిడియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు పొందవచ్చు.
* రెండు కండోమ్స్‌తో రెట్టింపు రక్షణ
రెండు కండోమ్స్ రెట్టింపు రక్షణనిస్తాయనేది అపోహ మాత్రమే. వాస్తవానికి సెక్స్‌లో ఉన్నప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ కండోమ్స్ ఉపయోగించడం మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఘర్షణ కారణంగా కండోమ్ విరిగిపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి ఒకే కండోమ్ వాడటం ఉత్తమం.
* టాయిలెట్ సీటు ద్వారా STIల సంక్రమణ
సాధారణంగా STIలు అసురక్షిత యోని, అంగ లేదా నోటి సెక్స్ ద్వారానే కాకుండా జననేంద్రియ సంపర్కం, సెక్స్ బొమ్మల షేరింగ్ ద్వారా వ్యాపిస్తాయి. పైగా STIలు మానవ శరీరం వెలుపల ఎక్కువ కాలం జీవించలేవు. కాబట్టి టాయిలెట్ సీట్లు వంటి ఉపరితలాలపై ఉంటే త్వరగా చనిపోతాయి. అదేవిధంగా క్లామిడియా, గనేరియా, సిఫిలిస్ వంటి STIలకు కారణమయ్యే బాక్టీరియా, శరీర శ్లేష్మ పొరల వెలుపల గణనీయమైన సమయం వరకు జీవించలేవు. ఆ కారణంగా అవి టాయిలెట్ సీటుపై ఉండవు.
* STIలకు చికిత్స లేదు
వాస్తవంగా STIలకు చికిత్స చేయగలిగినప్పటికీ అన్నింటినీ నయం చేయలేం. ఎనిమిది వ్యాధికారక క్రిములు చాలా ఎక్కువ STIలను కలిగి ఉన్నాయని WHO వివరిస్తుంది. ఈ ఎనిమిదిలో నాలుగు అయిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సిఫిలిస్, గనేరియా, క్లామిడియా, పరాన్నజీవి సంక్రమణ ట్రైకోమోనియాసిస్‌లను నయం చేయొచ్చు. మిగిలిన నాలుగు వైరల్: హెపటైటిస్ B, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్(HSV), HIV, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)లను నయం చేయలేం. అయితే HPV అంటువ్యాధులు తరచుగా శరీరం ద్వారా సహజంగానే క్లియర్ చేయబడతాయని గమనించాలి.
* లైంగిక సంపర్కం జరగకుంటే STI సంక్రమించదు
అంగప్రవేశంతో కూడిన సెక్స్ ద్వారానే STI సంక్రమిస్తుందనేది అపోహ. ఓరల్ సెక్స్, జెనెటిల్ కాంటాక్ట్, సెక్స్ టాయ్స్ షేరింగ్ ద్వారా STIలు వ్యాప్తిచెందుతాయి. లైంగిక సంబంధాలతోనే కాక ఇంజెక్షన్స్ షేరింగ్ ద్వారా, అంటు వ్యాధికారకాన్ని కలిగి ఉన్న రక్తానికి గురికావడం ద్వారా కూడా STI సంక్రమించడం సాధ్యమే.
* స్వలింగ సంపర్కులే HIV బారినపడతారు
లైంగిక ధోరణి, జాతి, వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా ఎవరైనా HIV బారిన పడవచ్చు. హెచ్‌వీ సోకిన వ్యక్తులకు ఆ విషయం తెలియకుంటే ఇతరులకు పాస్ చేసే అవకాశం ఉంది. తెలిసిన వ్యక్తులైతే తమతో పాటు తమ భాగస్వామి ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారని నిర్ధారించుకోవచ్చు.
* లక్షణాలు ఉంటేనే STIని వ్యాప్తి చేయొచ్చు
చాలా మంది వ్యక్తులు తమకు తెలియకుండానే ఇతరులకు STIలను వ్యాప్తిచేస్తారు. ఎందుకంటే మెజారిటీ STIలకు ఎటువంటి లక్షణాలు ఉండవు లేదా తేలికపాటి లక్షణాలు ఉన్నా అవి STIగా గుర్తించబడవు. అందుకే వీలైనంత వరకు క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, కండోమ్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం.
ఇవి కూడా చదవండి : నోరు ఇన్ని అనారోగ్యసమస్యల గురించి చెప్తుందా?