- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకంగా బస్సులోనే అలాంటి పని చేసిన యువతి.. తిట్టిపోస్తున్న జనాలు
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో యువత బహిరంగ ప్రదేశాల్లో వింత వింత పనులు చేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం మెట్రో రైళ్లలో వింత చేష్టలు, బైక్ స్టంట్స్ లాంటివి చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అయితే పలు చోట్ల ధూమపానం నిషిద్ధం, కీప్ సైలెన్స్, యూస్ డస్ట్ బిన్ అని రాసి ఉంటాయి.
అయితే ఇవి మాత్రమే కాదండోయ్ ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించే ఏ చిన్న విషయమైనా నేరం కిందికే వస్తుంది. తాజాగా ఓ మహిళ ఓ వింత పని చేసి తోటి ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరిలా బస్సు ఎక్కిన ఓ మహిళ.. అందరూ ప్రశాంతంగా ప్రయాణిస్తున్న సమయంలో వింత చర్యకు పాల్పడింది.
టపాసులను బస్సులో కాల్చింది. దీంతో ఒక్కసారిగా బస్సులోని ప్రయాణికుందరూ ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దం రావడం, నిప్పు రవ్వలు ఎగిసిపడడంతో బస్సులో ఉన్నవారందరూ భయపడ్డారు. గతేడాది జరిగిన ఈ ఘటనను పలువురు నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తూ.. మహిళలకు ఫ్రీ బస్సు అని ఇలా చేసేరు అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో వీక్షించిన జనాలు ఆ యువతిపై దుమ్మెత్తిపోస్తున్నారు.