- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral : ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని.. ‘దారుణానికి ఒడిగట్టిన’ యువకుడు!
దిశ, ఫీచర్స్ : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు. చివరికి ప్రేమికులైనా, భార్యా భర్తల బంధమైనా ఎక్కడో ఒకచోట డబ్బుతో ముడిపడి ఉంటుందని ఎంతో మంది చెప్తుంటారు. ఇది నిజమని నిరూపించే సంఘటనలు కూడా మన చుట్టూ చాలానే జరుగుతుంటాయి. ప్రస్తుతం అలాంటి న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఓ యువకుడు ప్రియురాలితో బ్రేకప్ తర్వాత తన ‘ప్రేమ ఖరీదు’ను లెక్కించి మరీ ఆమెకు సెండ్ చేశాడు. లవ్‌లో ఉన్నప్పుడు పెట్టిన ఖర్చులన్నీ జీఎస్టీతో సహా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
సీఏ చదివిన ఓ యువకుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడు నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారట. ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లకు తిరిగారు. ఏమైందో కానీ మనస్పర్థలు వచ్చి అమ్మాయి బ్రేకప్ చెప్పేసిందట. దీంతో ఆ యువకుడు కలిసి ఉన్నప్పుడు చూసిన సినిమాలకు, తాగిన కాఫీలకు, క్యాబ్ జర్నీకి ఇలా.. ప్రతి ఒక్క ఖర్చునూ లెక్కించాడు. సుమారు రూ. 2 లక్షల వరకు అయిందని, వాటిని సగానికి తగ్గించడంతోపాటు తాను పెట్టిన ఖర్చులకు 18 శాతం జీఎస్టీని జోడించానని పేర్కొన్నాడు.
ప్రియురాలికి పంపిన ఖర్చుల వివరాలన్నీ సదరు యువకుడు చక్కగా ఎక్సెల్ షీట్‌లో పొందు పర్చి.. ఆమెకు మెయిల్ చేశాడు. ఆ తర్వాత దానిని ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేశాడు. బ్రేకప్ అయినందుకు తన ఖర్చులు మొత్తం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అతను చేసిందే కరెక్టేనని ఒక వ్యక్తి కామెంట్ చేయగా.. ‘చివరికి మార్టిన్ కాయిల్‌ను కూడా వదలల్లేదుగా.. గ్రేట్ అవేర్ నెస్’ అంటూ మరో వ్యక్తి స్పందించాడు. ఇంకొందరు ‘అవునా ఎంత బ్రేకప్ చెప్తే మాత్రం అంత దారుణానికి ఒడిగడతాడా.. పాపం!’ అంటూ సెటైరికల్‌గా రియాక్ట్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.