- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాపీ టియర్స్.. ఆధ్యాత్మిక అభివృద్ధిలో కీలకంగా ఆనందభాష్పాలు
దిశ, ఫీచర్స్: హ్యాపీ టియర్స్.. మనసును ముంచెత్తిన సంతోషం విస్ఫోటనం చెందినప్పుడు కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తాయి. స్వచ్ఛమైన, హద్దులేని ఆనందాన్ని పొందిన క్షణానికి సాక్షంగా మిగిలిపోతాయి. అయితే ఆనందభాష్పాలు అనేవి భావోద్వేగ స్థితికి సంకేతం మాత్రమే కాదు.. మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎలాంటి లాభాలున్నాయి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
మన శరీరం తీవ్రమైన భావోద్వేగాలను ఎక్స్‌ప్రెస్ చేసేందుకు కన్నీళ్లు సహజ మార్గం. ఎమోషనల్ స్టేట్‌కు సంబంధించిన భౌతిక వ్యక్తీకరణ. అంతేకాదు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకోవడం అనేది శరీరంలో ఏర్పడిన ఉద్రిక్తత, ఒత్తిడిని విడుదల చేయడానికి ఒక మార్గం. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను అనుభవించినప్పుడు.. పెరిగిన హృదయ స్పందన రేటు, శ్వాసతో సహా శరీరంలో ఒక రకమైన ఉద్వేగభరితమైన భావాలు ఏర్పడుతాయి. ఇలాంటి సమయంలో ఈ ఒత్తిడిని వదిలించుకోవడానికి, ప్రశాంతతను పునరుద్ధరించడానికి కన్నీళ్లు సహాయపడుతాయి.
1. మెరుగైన అనుభూతి
యాక్ట్ ఆఫ్ క్రైయింగ్ అనేది పాజిటివ్ లేదా నెగెటివ్ ఎమోషన్‌తో సంబంధం లేకుండా.. ఒక రకమైన అంతర్గత స్థిరత్వం లేదా హోమియోస్టాసిస్‌ను సాధించడంలో సహాయపడుతుంది. మనం ఆనందం వంటి తీవ్రమైన భావోద్వేగాలకు లోనైనప్పుడు.. మన శరీరం ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్, డోపమైన్లతో సహా అనేక రకాల అనుభూతిని కలిగించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు మన మానసిక స్థితి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.
2. అణచివేయబడిన భావోద్వేగాల వ్యక్తీకరణ
మన దైనందిన జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు ఒత్తిళ్లు, భయాలు, ఆందోళనలను స్పృహతో లేదా తెలియకుండానే అణిచివేయడం చేస్తుంటాం. అయితే మన జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన ఎదురైనప్పుడు సంతోషంగా కన్నీళ్లు పెట్టడం ద్వారా ఈ రిప్రెస్‌డ్ ఎమోషన్స్‌ను రిలీజ్ చేస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిలో ఏడ్వడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి జాబ్ కొట్టిన తర్వాత దు:ఖించడం ఈ కోవలోకే వస్తుండగా.. ప్రెజర్ వాల్వ్‌ను విడుదల చేసినట్లుగా ఇన్నాళ్లు దాచిన, ప్రాసెస్ చేయని భావోద్వేగాల విడుదలను ఆనంద భాష్పాల ద్వారా బయటకు పంపిస్తాం.
3. కమ్యూనికేషన్
మానవులు సామాజిక జీవులు. మనం పరస్పరం ఇంటరాక్ట్ అయ్యే ప్రధాన మార్గాలలో ఒకటి నాన్-వర్బల్ కమ్యూనికేషన్. ‘కొన్నిసార్లు, ప్రత్యేకించి నోటి నుంచి మాటలు రాకుండా, కన్నీళ్లు పెట్టుకోవడం అనేది భావోద్వేగాల లోతును చూపుతుంది. ఆప్యాయత, ప్రేమ, కృతజ్ఞత, ఆనందం వంటి భావోద్వేగాలను.. పదాలతో సంబంధం లేకుండా అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తుంది.
4. కనెక్ట్
కమ్యూనికేషన్‌లో ఒక అడుగు ముందుకేసి, సంతోషంగా కన్నీళ్లు పెట్టుకోవడం మనం ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది. మీరు సన్నిహితంగా ఉన్న వ్యక్తిని చూసినప్పుడు లేదా వారి మాట విన్నప్పుడు తెలియకుండానే సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇది సహజంగా మీరు మధ్య ఉండే లోతైన బంధాన్ని తెలియజేస్తుంది. హ్యాపీ క్రయింగ్ సమయంలో విడుదలయ్యే ఒక రకమైన హార్మోన్ ఆక్సిటోసిన్ సామాజిక బంధాన్ని ప్రోత్సహిస్తుందని చెప్తున్న నిపుణులు.. దుర్భలత్వం నుంచే ఎమోషనల్ స్ట్రెంత్ వస్తుందని వివరించారు.
5. ఆధ్యాత్మిక స్వస్థత
మీరు మతపరమైన వ్యక్తి అవునా? కాదా? అనే విషయంతో సంబంధం లేకుండా.. ఏ విధమైన అడ్డంకులు లేకుండా మీ అంతరంగాన్ని కనెక్ట్ చేయడంలో ఆనంద భాష్పాలు సహాయపడతాయి. ఇది భావోద్వేగ మేధస్సుకు సంకేతం మాత్రమే కాదు.. ఒక వ్యక్తిగా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయగల గాఢంగా కదిలించే అనుభవంగా కూడా ఉంటుంది.
6. శారీరక ఆరోగ్యానికి కూడా మంచిది
హ్యాపీ టియర్స్ భావోద్వేగ ప్రయోజనాలనే కాదు ఫిజికల్ బెనిఫిట్స్‌ను కూడా కలిగి ఉంటుంది. కన్నీళ్లు మన కళ్లను శుభ్రపరచడానికి, ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి సహాయపడే అనేక రకాల సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఏడుపు మన శ్వాసను నియంత్రించడంలో సహాయపడుతుంది. హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. ఆందోళన లేదా ఒత్తిడి భావాలను తగ్గిస్తుంది. రక్తపోటు, పల్స్ రేటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇది ఒత్తిడితో కూడిన పరిస్థితుల నుంచి విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి సహాయపడుతుంది.
Also Read...
ఆ టాటూతో పునర్జన్మ.. సింబల్‌కో నమ్మకం! ట్రెండ్‌గా మార్చుకున్న యువత