Sleep Duration : కంటినిండా నిద్రపోవడంలో ముందున్న ఆ దేశ ప్రజలు.. కారణం ఇదే !

by Javid Pasha |
Sleep Duration : కంటినిండా నిద్రపోవడంలో ముందున్న ఆ దేశ ప్రజలు.. కారణం ఇదే !
X

దిశ, ఫీచర్స్ : కోట్లాది ఆస్తులు లేకపోయినా సరే.. బతకడానికి సరిపోయేలా కనీస అవసరాలు, కంటి నిండా నిద్ర ఉంటే చాలు.. జీవితంతాం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు అంటుంటారు పెద్దలు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చాలా మంది కంటిమీద కునుకు కరువై అవస్థలు పడుతున్నారని ‘గ్లోబల స్లీపింగ్ స్టడీ’ ఇటీవల నివేదిక పేర్కొన్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఆయా దేశాల ప్రజల నిద్ర అలవాట్లపై సర్వే చేయగా కొన్ని దేశాల్లోని ప్రజలు 7 నుంచి 8 గంటలకు పైగా నిద్రపోతుండగా.. చాలా దేశాల్లోని ప్రజలు ఏడుగంటలకు మంచి నిద్రపోవడం కష్టమైపోతోందని నిపుణులు చెప్తున్నారు.

నాణ్యమైన నిద్రకు ప్రజలు దూరం కావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. ఇవన్నీ ఆయా దేశాల ప్రభుత్వ విధానాలపై కూడా కొంత ఆధారపడి ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందరికీ సమాన అవకాశాలు అందకపోవడం, నిరుద్యోగం, ఉపాధిలేమి వంటివి ప్రజల కనీస అవసరాలను తీర్చుకోలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఇవి పరీక్షంగా నిద్ర అలవాట్లను ప్రభావితం చేస్తున్నాయి. అయితే దీనికి చక్కటి పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయడుతున్నారు.

ఇకపోతే సరైన నిద్ర అలవాట్లు లేదా క్వాలిటీ స్లీప్ వంటివి కలిగి ఉన్న దేశాల జాబితాలో నెదర్లాండ్ మొదటిస్థానంలో ఉందని, ఇక్కడి ప్రజలు రోజుకు 8. 1 గంటలు నిద్రిస్తున్నారని గ్లోబల్ స్లీపింగ్ స్టడీ - 2024 నివేదిక వెల్లడించింది. రెండవ స్థానంలో ఫిన్‌లాండ్ ప్రజలు రోజుకు 8 గంటలు నిద్రిస్తుండగా, మూడవ స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా.. ఇక్కడి ప్రజలు రోజుకూ 7.8 గంటలు నిద్రిస్తున్నారు. ఇక న్యూజిలాండ్ ప్రజలు రోజుకు 7.9 గంటలు, కెనడా, డెన్మార్క్ దేశాల ప్రజలు 7.7 గంటల నాణ్యమైన నిద్ర అలవాట్లతో నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు. ఆరవ స్థానంలో ఇంగ్లండ్, జర్మనీ, స్వీడన్ ఉండగా, ఇటలీ, బెల్జియం, ఏడవస్థానంలో, జపాన్, స్పెయిన్, ఉత్తరకొరియా ఎనిమిదివస్థానంలో ఉన్నాయి. మెక్సికో 10వ స్థానంలో ఉండగా 7.1 గంటల నిద్ర అలవాట్లతో భారత్ 11వ స్థానంలో ఉందని గ్లోబల్ స్లీప్ స్టడీ నివేదిక పేర్కొంటున్నది. ఇక వీటికి మినహాయించి మిగతా దేశాల ప్రజలు రోజుకు 7 గంటలకంటే తక్కువ నిద్రను అనుభవిస్తున్నారని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed